నేను ఎవరి మీద ఆధారాపడను అంటూ కటింగ్లు ఇస్తూ తిరిగే నాకు దేవుడు 3 ప్రమాదాలు సృష్టించి బుద్ది వచ్చేలా చేసాడు .... కట్ చేస్తీ
ఏప్రిల్ 14 2012
ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తున్న నాకు అమ్మ ఫోన్ చేసింది తమ్ముడు ముంజులూ తెచ్చాడు రా అని... ముంజులూ పేరు వినగానే వెంటనే బయలుదేరా తలం వేసి....బాగా వాటంగా బలిసిన తందూరి చికెన్ కనిపించానో ఏమిటో ఒక పిచ్చి కుక్క (తర్వాత తెలిసింది అది పిచ్చిది అని) నా కాలు ని పట్టేసుకుంది...ఏముంది చిన్న గాయమే అని ఇంజక్షన్ తీసుకున్న... అయ్యిందా కుదురుగా ఉండాలిగా అబ్బే అలా ఉంటె నేను శిరీష ని ఎలా అవుతా ?? మల్లి కట్ చేస్తీ
మే 17 2012
ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నా...ఇంకో 2 నిముషాలలో ఇంట్లో ఉంటా అనగా ఎక్కడనుంచి వచ్చాడో మా పక్కింటోడు ( వీడి డ్రైవింగ్ చూసి చాలా సార్లు అనుకున్న వీడు ఎప్పుడు ఎవడ్నో గుద్దేస్తాడు అని...) వాడు ముందు వెళ్ళాడు వాడి వెనక నేను...ఏదో వెహికల్ అడ్డం గ ఉంది సో ఇంకా వాడు వెనక ఉన్న నన్ను చూడకుండా రివర్స్ గేర్ వేసెయ్యడం నేను కిందపడటం నా కాలు మీద నుంచి వాడి కార్ చక్రం వెళ్ళడం 5 సెకండ్స్ లో జరిగి పోయాయి ... ఏముంది హాస్పిటల్ కి వెళ్తే కాలు ఫ్రాక్చర్ అమ్మ 45 రోజులు బెడ్ రెస్ట్ అన్నాడు (కాలు మీద నుంచి చక్రం వెళ్ళిపోయినా చిన్న ఫ్రాక్చర్ ఏనా ? అనుకున్న ..వెంటనే పవన్ గుర్తు వచాడు :D ) ఇంటికి రాగానే మా చెల్లి వేసిన ఫస్ట్ డైలాగ్ ఎవరి మీద ఆధారపడను అన్నావుగా ఇప్పుడు ఎం చేస్తావ్ అని.... నేను ఎం ఆధారపడను చూడు అని మొండిగా తిరిగేసా ... అబ్బ దీనికి ఇంకా బుద్ది అనుకున్నాడు దేవుడు ...మల్లి కట్ చేస్తీ
సెప్టెంబర్ 14 2012
ఆఫీసుకి వెళ్తున్న 8.20 అయ్యింది సిగ్నల్ పడింది రైట్ లో ఉన్న గ్యాప్ లో ముందుకు వెళ్తున్న కాబ్ డ్రైవర్ సడన్ గా డోర్ తియ్యడం నా లెఫ్ట్ హ్యాండ్ కి తగలటం నేను రోడ్ అవతల పడటం నా చెయ్య ఉంగరం వేలు తెగటం అన్ని 10 సెకండ్స్ లో జరిగిపోయాయి ...ఎదురుగ ఉన్న అపోలో హాస్పిటల్ లో మా అత్త జాబ్ చేస్తుంది సో అక్కడికి వెళ్ళ వాడు ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు గో టూ జూబ్లి అన్నాడు... తమ్ముడు అమ్మ వచ్చారు డాక్టర్ ఆపరేషన్ అన్నాడు 3 గంటలు చేసాడు..ఈ సారి నేను కంప్లీట్ గా అమ్మ మీద అదారపడ్డ .... అప్పుడు తగ్గింది నా పొగరు ..భయం మొదలు అయ్యింది...
ఇప్పుడు కుదురు గా అనుకువుగా ఉంటున్న .....
అందుకే బ్లాగ్ కూడా ఎం చెయ్యలేదు