జైహింద్

Saturday, August 14, 2010

| | | 7 comments



2 వారాల ముందు నుంచి టీచర్స్ ఇంకా participants హడావిడి తో మొదలు అయ్యి ...choclates తింటూ ఇంటికి వెళ్ళడం తో ముగిసే పండుగ ఆగష్టు 15 అంటే ..

అలా చూడటాలు లేవు...

నేను అసలే చాలా చురుకు అయిన పిల్లని కదా అందుకే ఏ ఆటలోనూ పాలుగోకుండా...అందర్నీ అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని గదమయిస్తూ తిరుగుతూ ఉండటమే స్కూల్ గర్ల్స్ లీడర్ గా నా బాద్యతలు...మరి అంత పెద్ద పోస్ట్ లో ఉండి స్కూల్ లో ఆటల పోటీలు అవి organize చేస్తూ క్లాసు decorations చేస్తూ...చేసినవాటిని పాడు చేసారు అని కంప్లైంట్ ఇచిన వాళ్ళకి పెద్ద రాయుడు ల తీర్పులు చెప్తూ తిరుగుతుంటే ఆ మజా నే వేరు...దేవుడా ఒక్కసారి నీ పుష్పక విమానం ఇస్తే అలా ఒక్కసారి స్కూల్ డేస్ లో కి వెళ్లి మళ్ళి నీ విమానం నీకు పంపించేస్తాను ..

ఆగష్టు 15 నాడు పొద్దునే లేచి ఆ ముందు రోజు రెడీ గా పెట్టుకున్న వైట్ డ్రెస్ వేసుకుని పైనుంచి కింద వరకు అన్ని వైట్ లో మల్లెపూవులా మెరిసిపోతూ జెండా పట్టుకుని చెల్లి తో పాటు స్కూల్ కి వెళ్ళడం....జెండా ఎప్పుడు ఎగరేస్తేరా choclates ఎప్పుడు ఇస్తార అని ఎదురు చూడటం...ఇక్కడ దాక ఏ ఇబ్బంది లేదు ....తర్వాత అదే అటలతోనే ఇబ్బంది ఎందుకు అంటే వైట్ డ్రెస్ కాస్త బ్రౌన్ డ్రెస్ ఇంకా ఏ రంగులు దొరికితేయ్ ఆ రంగులోకి మారిపోతుంది కదా...ఒక వయసు వచ్చే వరకు అమ్మ ఎం అనలేదు ....కానీ ౬థ్ క్లాసు తర్వాత మాతోనే ఉతికించేది ...బట్టలని పెరట్లో బోరింగ్ పంప్ దగ్గర పెట్టుకుని ఉతకడం అదో సరదా...

ఆగష్టు 15 కి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఏంటో...నాకు ఎప్పటికి అర్ధం కానీ విషయం...

ఏది ఏమైనా పుణ్య భూమి నా దేశం నమో నమామి...ధన్య భూమి నా దేశం సదా స్మరామి....జైహింద్. ....జైహింద్.

పుస్తకాలూ

Wednesday, August 11, 2010

| | | 2 comments
పుస్తకాలు చదవడం నాకు ఇష్టం ఇంగ్లీష్ నవలలు తక్కువ కానీ తెలుగు బాగా చదువుతా...ఇప్పటివరకు కొని చదవలేదు వాళ్ళు వీలు ఇచ్చినవి ...online లో...ఇలా గడిపేస్తున్న...చాలా మంది బ్లాగ్గెర్స్ వాళ్ళ బ్లాగ్లో పుస్తకాల గురించి రాసిన reviews చూసి నేను మొన్న కొన్ని బుక్స్ కొన్న...



నెమలికన్ను, ఇల్లేరమ్మ కథలు, మహి, గోదావరి కదలు, సారీ ఖరీదు అండ్ అందమైన అనుభవం

వీటిలో అందమైన అనుభవం చదివాను--- 10th క్లాసు సినిమా స్టొరీ నే...తిట్టుకోవద్దు ఇంత సింపుల్ గా చేప్పేసా అని ...మీలో ఎవరైనా ఈ బుక్ చదివి రివ్యూ రాసి ఉంటెయ్ లేదా రివ్యూ ఎక్కడైనా చదివి ఉంటెయ్ నాకు చెప్పండి సరేనా

మిగతా బుక్స్ కూడా చదివేయ్యాలి ...

09 .08 .2010 నుంచి నేను పుస్తకాల సేకరణ మొదలు పెట్టాను అన్న మాట....సో మంచి పుస్తకాలని సూచించి నా అభిరుచిని పెంపొందించ ప్రార్ధన