పొగరు / భయం

Tuesday, December 18, 2012

| | | 2 comments


నేను ఎవరి మీద ఆధారాపడను అంటూ కటింగ్లు ఇస్తూ తిరిగే నాకు దేవుడు 3 ప్రమాదాలు సృష్టించి బుద్ది వచ్చేలా చేసాడు .... కట్ చేస్తీ  

ఏప్రిల్  14 2012

ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తున్న నాకు అమ్మ ఫోన్ చేసింది తమ్ముడు ముంజులూ తెచ్చాడు రా  అని... ముంజులూ పేరు వినగానే వెంటనే బయలుదేరా తలం వేసి....బాగా వాటంగా బలిసిన తందూరి చికెన్ కనిపించానో ఏమిటో ఒక పిచ్చి కుక్క (తర్వాత తెలిసింది అది పిచ్చిది అని) నా కాలు ని పట్టేసుకుంది...ఏముంది చిన్న గాయమే అని    ఇంజక్షన్ తీసుకున్న... అయ్యిందా కుదురుగా ఉండాలిగా  అబ్బే అలా ఉంటె నేను శిరీష ని ఎలా అవుతా ?? మల్లి కట్ చేస్తీ 

మే 17 2012

ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నా...ఇంకో 2 నిముషాలలో ఇంట్లో ఉంటా అనగా ఎక్కడనుంచి వచ్చాడో మా పక్కింటోడు ( వీడి డ్రైవింగ్ చూసి చాలా  సార్లు అనుకున్న వీడు ఎప్పుడు ఎవడ్నో గుద్దేస్తాడు అని...) వాడు ముందు వెళ్ళాడు వాడి వెనక నేను...ఏదో వెహికల్ అడ్డం గ ఉంది  సో ఇంకా వాడు వెనక ఉన్న నన్ను చూడకుండా రివర్స్ గేర్ వేసెయ్యడం నేను కిందపడటం నా  కాలు   మీద నుంచి వాడి కార్  చక్రం  వెళ్ళడం 5 సెకండ్స్ లో జరిగి పోయాయి ... ఏముంది హాస్పిటల్ కి వెళ్తే  కాలు  ఫ్రాక్చర్ అమ్మ 45  రోజులు బెడ్ రెస్ట్ అన్నాడు (కాలు మీద నుంచి చక్రం  వెళ్ళిపోయినా చిన్న ఫ్రాక్చర్ ఏనా ? అనుకున్న ..వెంటనే పవన్   గుర్తు వచాడు :D ) ఇంటికి రాగానే మా చెల్లి వేసిన ఫస్ట్ డైలాగ్    ఎవరి మీద  ఆధారపడను అన్నావుగా ఇప్పుడు  ఎం  చేస్తావ్ అని.... నేను ఎం ఆధారపడను చూడు అని మొండిగా  తిరిగేసా ... అబ్బ దీనికి ఇంకా బుద్ది అనుకున్నాడు దేవుడు ...మల్లి కట్ చేస్తీ 

సెప్టెంబర్ 14 2012

ఆఫీసుకి వెళ్తున్న 8.20 అయ్యింది సిగ్నల్ పడింది  రైట్ లో ఉన్న గ్యాప్ లో ముందుకు వెళ్తున్న కాబ్ డ్రైవర్ సడన్ గా  డోర్ తియ్యడం నా లెఫ్ట్ హ్యాండ్ కి తగలటం నేను రోడ్ అవతల పడటం నా చెయ్య ఉంగరం వేలు తెగటం అన్ని 10 సెకండ్స్ లో  జరిగిపోయాయి ...ఎదురుగ ఉన్న అపోలో హాస్పిటల్ లో మా అత్త  జాబ్ చేస్తుంది సో అక్కడికి వెళ్ళ వాడు ఇక్కడ  ఎక్విప్మెంట్ లేదు గో టూ  జూబ్లి అన్నాడు...   తమ్ముడు అమ్మ వచ్చారు డాక్టర్ ఆపరేషన్ అన్నాడు 3 గంటలు చేసాడు..ఈ సారి నేను కంప్లీట్ గా  అమ్మ మీద అదారపడ్డ .... అప్పుడు తగ్గింది నా  పొగరు ..భయం  మొదలు అయ్యింది...

ఇప్పుడు కుదురు గా  అనుకువుగా ఉంటున్న .....

అందుకే బ్లాగ్ కూడా ఎం చెయ్యలేదు 

నిండునదులు పాఱు నిలిచి గంభీరమై

Tuesday, June 19, 2012

| | | 0 comments




నిండునదులు పాఱు నిలిచి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగఁ బొరలి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

తా|| వరదలు లేని రోజులలో నదులు నీటితో నిండియుండి ప్రశాంత గంభీరముగా ప్రవహించును. అట్లే జ్ఞానులైన 


పెద్దలు వివేకముతో ప్రశాంతముగా మాటలాడుదురు. చిన్న సెలయేరు ఒడి దుడుకులతో ఒక్కసారి ఉద్రుతముగా 


ప్రవహించి అన్నిటినీ కూల్చివేయును. అట్లే అల్పు డైన వాడు ఆవేశపడి మాటలాడి కార్యములను చెద గొట్టును .

తనువులస్థిరమని ధనములస్థిరమని

| | | 1 comments








తనువులస్థిరమని ధనములస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ
విశ్వధాభిరామ వినురవేమ

భావము:
ఈ శరీరం,ఈ ధనం అన్నీ అశాశ్వతం అని డాంబికుడు పది మందికీ చెబుతాడే తప్ప,తాను మాత్రం ఆ సత్యాన్ని విశ్వసించి ఆచరించడు. చెప్పడం తేలికే ఆచరించడమే కష్టము అంటున్నాడు ఈ పద్యములో వేమన.చెప్పింది చేసి చూపించేవాడే ఆదర్శ గురువు,కానివాడు మానవ సమాజానికే బరువు అని ఈ పద్య భావము.

క్షేమంగానే ఉన్నా :)

| | | 1 comments

దాదాపు సంవత్సరం అయ్యింది ఈ బ్లాగ్ లో టపా రాసి... ఇవ్వాళా పొద్దున ఫేస్ బుక్ లో నా స్నేహితుడి వేమన శతకం లో ఒక పద్యం షేర్ చేసాడు ....అతను షేర్ చేసిన ఉద్దేశం ఏది అయిన నాకు వెంటనే నేను రోజు ఒకటి చదువుకుంటే  బాగుంటుంది కదా అని అనిపించింది...అందుకే ఈ రోజునుంచి  ఒక వేమన పద్యం నా బ్లాగ్ లో పొందుపర్చుకుంటా ..అలానే ఇంకా బోల్డు కబుర్లు కూడా చెప్పుకుందాం ....

అయ్యో పాపం ....

Wednesday, June 8, 2011

| | | 0 comments


నేను ఈ మధ్య ఎక్కువ గా  నా ఫోటో బ్లాగ్ లో ఉంటున్నా... అలా గుర్రుగా  చూడటాలు  లేవు ....

సరే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు  అని అడగండి.. అడగకపోయినా చెప్తా  :( బాధ అండి బాధ... ఫోటోలు తీసి బ్లాగ్ పెట్టడం వరకు బాగానే ఉంది...అక్కడనుంచి అందరికి చూపించి నేను పెట్టె హింస ఉంది చూసారు...పాపం నా బ్లాగ్ చూసి బలి అయ్యినవాళ్ళే చెప్పాలి...

బాగుందా అని అడగటం వాళ్ళు మొహమాటానికి బాగుంది అనడం...నేను రెచ్చిపోయి  ఇంకో నలుగురికి చూపించడం...అలా మొన్న ఆదివారం మా చెల్లి వాళ్ళ ఆయనికి చూపించా...అక్కడికి అయన నా బాధ పడలేక సీరియస్ గా పని ఉన్నట్లు బిల్డ్ అప్ ఇస్తున్నా..నేను పిలిచి మరి ఒక్కో ఫోటో తీసి చూపిస్తున్నా...అయన మొహం లోకి చూడకుండా ...కాసేపటికి మా చెల్లి వచ్చింది అమ్మ తో సుత్తి ఆపి...వాళ్ళ అయిన మొహం దిగులుగా పెట్టుకుని టీవీ చూస్తున్నారు అంట..ఏంటి అండి ఎం అయ్యింది అని అడిగింది...మీ అక్క ఇందాకట్నుంచి నన్ను హింసిస్తుంది అని కంప్లైంట్..ఏంటి అంటే ఫొటొస్ చూపిస్తుంది ...వాటి మీద నా అభిప్రాయాలూ అడుగుతుంది ..నా మొహం లోకి అసలు చూడటం లేదు ...అదేదో సినిమాలో వేణు తీసిన తోక ఎత్తిన కాకి తోక దించిన కాకి ఫోటో లా ఉన్నాయి  అని....అంతే ...నేను చాల బాధ పడ్డాను...

వాళ్ళకి దేవుడు కెమేరా ఐ ఇవ్వలేదు అని సరిపెట్టుకున్న...ఇంకా ఎవరికీ చూపించను కూడా... అందుకే ఫేస్ బుక్ లో లింక్ పెట్టుకుంటున్న...పాపం అప్పుడప్పుడు ఎవరో ఒకరు చూసి బాగుంది అంటున్నారు లెండి...

మీకు చూడాలి అని ఆశ  గా ఉంది కదూ , చూడండి మరి  -  అన్వేషణ

అయ్యో పాపం అనిపిస్తుంది కదూ మీకు కూడా...

ట్రాఫ్ఫిక్ పోలీసు :D

Tuesday, March 8, 2011

| | | 4 comments


నేను గత 7  సంవత్సరాలు గా బండి నడుపుతున్నా... కానీ లైసెన్సు కి అప్లై చేసింది మాత్రం 6  నెలల క్రితం...ఎప్పుడు ఏ ట్రాఫ్ఫిక్ పోలీసు నన్ను ఆపలేదు లైసెన్సు లేనప్పుడు....లైసెన్సు తిసుకునపట్నుంచి ప్రతి పోలీసు అపెస్తున్నాడు...ఇలా కాదు అని లైసెన్సు ఇంట్లో పెట్టి వచ్చా కొన్ని రోజులు చిత్రం  గా మల్లి ఒక్కడు ఆపలేదు...

ఎందుకు వచ్చిన గోల లే అని లైసెన్సు పెట్టుకుని తిరుగుతున్నా లెండి...

నిన్న నో U turn దగ్గర బండి తిప్పేసా ఎవరు లేరు కదా అని...కానీ అక్కడ ఇద్దరు బాబాయిలు ఉన్నారు...అపబోయి సరే అమ్మాయి కదా అని ఒదిలేసాడు...నేను కుదురుగా ఉండకుండా వెనక్కి వెళ్లి ఏంటి ఆపారు అని అడిగా పెద్ద విజయశాంతి లా... వాడు మీకు ఫైన్ వెయ్యాలి వ్రొంగ్ రూట్ లో వచ్చారు అన్నాడు...నేను ఇచ్చిన  సమాధానం ఉహించండి ఎవరు అయిన?? ..నా దగ్గర డబ్బులు లేవు అండి ...మా డాడీ ఫుల్ ట్యాంక్ చేయిస్తారు ..అమ్మ బాక్స్ లో నూడ్లేస్ పెట్టి ఇస్తుంది  అని చెప్పా అనుకుంటున్నారా??? కాదు
.
.
.
.
.
.
.
.

అవునా నాకు తెలియదు అండి చూసుకోలేదు అక్కడ tyre మార్క్స్ ఉన్నాయి కదా అవి చూసి వచ్చేసా...నేను మొన్న వచ్చినప్పుడు  ఇలా లేదు  అని చెప్పా...వాడు ఒక వెర్రి చూపు చూసి  సర్లే ఈ సారి చూసి వెళ్ళండి అని అన్నాడు....నేను థాంక్స్ చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చా...

ఆడవాళ్లు మీకు జోహార్లు

| | | 0 comments

ఆడది లేకపోతె ప్రపంచం లేదు...ఆడది లేకుండా ఒక్క రోజు కూడా సరిగా జరగదు....ఆలాంటి ఆడవాళ్ళ కోసం ఒక రోజు ఏంటో....ఎంత ఆలోచించినా నాకు ఇలాంటి విషయాలు అర్ధం కావు...

ఏది ఏమైనా....నా అభిమానులకి ( :D ) మహిళా దినోత్సవ శుభాకాంక్షలు