ఉహాసుంధరి

Wednesday, June 30, 2010

| | | 2 comments


అవును ఈ పేరు నాకు సరిగా సరిపోతుంది ...ఇలా జరుగుతుంది..అలా అయ్యి ఉంటుంది... ఇలా చేస్తారు ఏమో.. అలా చేస్తారు ఏమో అని అనుకున్నవి అన్ని 80% కరెక్ట్ గా అలానే అవుతాయి 20% రాంగ్ అవుతాయి... కానీ ఇలా ఉహించేసుకుని నేను పడే బాధ ఒకోసారి నేను రెండు సార్లు పడుతుంటా అన్న మాట.. సంఘటన జరగక ముందు ఒకసారి జరిగాక ఒకసారి..ఎవరన్నా నలుగురు మాట్లాడుకుంటే న గురించే నేమో..నన్ను చూసి నవ్వితే ఎందుకు నవ్వారో బాబోయి అనుకోవడం..నవ్వకపోటెయ్ ఎందుకు నావ్వలేదు..ఎం అయ్యిందో అని..

నలుగురు ఉన్న చోటికి వెళ్ళాలి ఆంటెయ్ ఇంకా ఆది నాకు ప్రపంచ యుద్దమే...వెళ్ళి నా పని నేను చేసుకుని రావడం లేదా వెళ్ళకుండా ఉండటానికి కారణాలు వెతుకోవడం... నాకు తెలిసిన వాళ్ల దగ్గరికి తప్ప కొత్త వాళ్ళతో కలవలెను...

ఇవి అన్ని చదివి తెనాలి లో కమల్‌హాసన్ ని అనుకునేరు...మరి అలా కాదు...

నాది ఖచితం గా జబ్బే..ఎవరన్నా డాక్టర్స్ ఉంటారా ఇలాంటి వాటికీ...

మా ఫ్యామిలీ ఫోటో

Saturday, June 26, 2010

| | | 3 comments
మా ఫ్యామిలీ ఫోటో
.
.
.
.
.
.
.
.
.
.



బాగుంది కడు..

నన్ను ఎం చెయ్యాలి అన్న అటు ఇద్దరు ఇటు ఇద్దరని దాటి రావాలి...

నా కుటుంబమే నా ఆస్తి.. నా సర్వస్వం

మనసాక్షి

| | | 3 comments



అప్పుడు నా వయసు 8...ఆ రోజు ఆదివారం... మా తమ్ముడిని ఎత్తుకుని మా ఇంటి నుంచి నేను ఇంటికి అంత దూరం ఎందుకు వెళ్ళాం నాకు ఇప్పటికీ అర్దం కాదు..అప్పటికీ మధ్యానం అయ్యింది...తమ్ముడు ఏడుస్తున్నాడు...వాడి ఏడుపు చూసి నేను ఏడుస్తున్న...ఎవరో ఇంటి ముందు ...ఎవరో ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు ఆంటెయ్ ..మా అమ్మ లేదు ఆకలి కి ఏడుస్తున్నాం అంటే ఆవిడ నాకు ఏదో పెట్టింది తినమని ఆది నాకు ఇస్టం లేదు అని చెప్ప....అప్పుడు ఆవిడ నాకు కోడిగుడ్డు తమ్ముడికి పాలు ఇచింది...అవి తినేసి..ఎలా ఇంటికి వెళ్లనో గుర్తు లేదు వెళ్ళిపోయ..

వేదించే ప్రశ్నలు ఎన్నోఅలా ఎందుకు వెళ్ళాను??
ఎందుకు ఏద్చను?
అప్పుడు ఇంట్లో ఎవరు లేరా?
అమ్మ ఏమీ చేస్తుంది?
ఆకలి వేస్తే అమ్మ ని అడిగాలి కదా?
ఎందుకు అడగలేక పోయాను?
అవి అన్ని గుర్తు లేవు ముందు వెనకలు గుర్తు లేవు
ఈ ఇన్సిడెంట్ మాత్రం పీడకల ల వెంటాడుతూనే ఉంటుంది
చినపుడు ఒక్కోసారి ఎంతో తెలియకుండా చేసేస్తుంటాం అని సరిపెట్టుకోలేను

కోడిగుడ్డు చూస్తే ఆ రోజు నేను చెప్పిన అబద్దం గుర్తు వస్తుంది...ఆ సంఘటన తల్చుకునప్పుడల్లా అలా ఎందుకు చేసానో అని నాకు తెలియకుండానే ఏడ్చేస్తాను... నేను చాలా సిగ్గు పడుతున్న .... బహుశా అప్పుడు అలా చేసిన పని అమ్మకి చెప్పి ఉంటెయ్ అమ్మ దండనతో నాలో బాధ పోయేది ఏమో... అమ్మకి చెప్పాలి అంటే భయం..బహుశా ఎప్పటికీ చెప్పలేను ఏమో...ఈ బాధ నా జీవితాంతం నన్ను వెంటాడుతుంది

అమ్మ నేను మంచి పిల్లని కాదు... ఈ విషయం నీ దగ్గర దాచాను...నన్ను క్షమించవు...

.....

Friday, June 25, 2010

| | | 0 comments

మార్పు! ప్రతి మనిషి సామాజికంగా జీవనపరంగా కావాలి అని కోరుకునేది
అబివృద్ది! అన్ని విషయాలలో కావాలి అని చూసేది..

కానీ ఎంత వరకు విజయం సాధిస్తున్నాం ....

మనసు ఎం బాగాలేదు... ఏ చ్యానెల్ చూసిన గొడవలు, మానబంగాలు, అక్రమ సమ్బదలుహత్యలు దోపిదులు, రోడ్ ప్రమాదాలు, పబ్ లో విశృంకలతలు..ఎందుకు ఇలా ఉంది నా దేశం...ఎప్పుడు ఇంతే నా నేను ఇప్పుడెయ్ గమ్‌నిస్తున్నానా?

అడాధే ఆధారం అంటారు నిజమే
ఎదుటి మనిషిని తిట్టాలి అన్న అడాధే ఆధారం
మనిషి పుట్టలి అన్నఅడాధే ఆధారం
శత్రువుని ఎదురుకోవాలి అన్న అడాధే ఆధారం
గొడవ పెట్టుకోవాలి అన్న అడాధే ఆధారం
జీవితం లో ఎదగాలి అన్న అడాధే ఆధారం
సర్వానాశనం అవ్వాలి అన్న అడాధే ఆధారం

అన్నిటికి ఆధారం అయిన అడధానికి ఆమె మనోనిబ్బరం వరమ లేక శపమా

దానిమ్మ

Sunday, June 20, 2010

| | | 2 comments


నేను అప్పుడు ౫ తరగతి చదువుతున్న….పరీక్షలు అయిపోయాయి……వేసవి సెలవలు…..హౌస్ ఓనర్ ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు ఉండేది…..అప్పుడెయ్ దానికి మొదటి సారి 3 పిన్దలు వచాయి…..రోజు గార్డెనింగ్ చేసేదాన్ని ఆంటీ తో కలిసి…ఒక రోజు ఆ కాయ మీడియమ్ సైజ్ కి వచ్చాక పండింది అని కోసెశా…కానీ మళ్లీ ఆంటీ కి చెప్పకుండా కోసా అని తిదుతుంది అని చెప్పి మన అతి తెలివితో దానికి దారం చూట్టి కొమ్మకి కట్టాను…..ఇంకా ఆది పడదు అని ధీమా గా వెళ్ళిపోయ….కానీ మన టైమ్ ఆది గాలికి పడిపోయింది సాయంత్రం ఆంటీ చూసేసింది…..ఎవరు కోసారో తెలియదు….పోనీ గాలికి పడింది అనుకోదానికి లేకుండా దానికి దారం……ఇంకా ఆవీడికి వచిన తిట్లు అన్ని స్టార్ట్ చేసింధీ…..మనకి భయం స్టార్ట్ అయ్యింది అమ్మకి తెలిస్టెయ్ ఉతికి అరెస్తుంది అని మంచం కింద కి దూరేస(అక్కడ అమ్మ పట్టాడు కదా రాలేదు)……ఎవరికి తెలియదు అమ్మ వాళ్ళు వేతుకుతున్నారు…..ఆ రోజు గురువారం ఫ్రైడే కి ఇల్లు కడిగెవాళ్ళు అప్పట్లో…….అమ్మ మంచం కిందకి నీళ్ళు పోస్తెయ్ నేను కుక్క పిల్లలా ములుగుతున్న…..అమ్మ వంగుని చూసి అక్కడ ప్రశాంతం గా పడుకున్న నన్ను చూసి ఆవిడ పడ్డ టెన్షన్ అంతా గుర్తు వచ్చి మంచం పక్కకి జరిపేసి నన్ను తన్నటానీకీ చెయ్య ఎత్తి ఒక్క సిక్స్ ఇచింది…..మళ్లీ కొట్టేలోపు నేను పడిపోయ…ఫుల్ ఫీవర్……వన్ వీక్ తగ్గలేదు…అప్పట్నుండి దానిమ్మకాయి చూస్తే…..ఆవిడ తిట్లు నా జ్వరం గుర్తు వస్తాయి….

(తప్పులు చాలా వస్తున్నాయి కొన్ని రోజులు భరించండి)

ప్రస్తుతం ఇలా ఉంది.

| | | 0 comments


కొత్త ఉద్యోగం లో చేరాను అందుకే రాయలేకపోయాను...కొత్త చోటు బాగుంది..మనుషులు బాగున్నారు...ముందు ముందు ఎలా ఉంటుందో మరి ..
మూడు రోజులుగా చక్కగా వర్షం లో తడుస్తూ ఇంటికి వెళ్తున్న... నా స్నేహితుడి పెళ్లి కి వెళ్ళడం కుదరడం లేదు... మా చెల్లి ని వాళ్ల ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యడం కుదరడం లేదు వాళ్ల ఆయన లేనప్పుడు .... బాగుంది జీవితం..ప్రస్తుతం ఇలా ఉంది...

వర్షం రోజు పడాలి ...

మానశసంచరరే

Monday, June 14, 2010

| | | 2 comments



నేను ఆన్‌లైన్ లో చదివిన మొదటి బుక్ ఇంకా బాగా ఇంప్రెస్ అయిన బుక్ ...ఈ నోవెల్ రాసిన రైటర్ ఒక మెడికో...చాలా బాగా రాశారు...తనకి ఎంసెట్ లో ర్యాంక్ రావడం తన చిన్నతనం..కాలేజ్ లైఫ్..హాస్టిల్ లైఫ్...తన ప్రేమ గురించి ఆమె చనిపోయినప్పటి బాధ గురించి...బెస్ట్ ఫ్రెండ్ గురించి...అసలు చదవడం స్టార్ట్ చేస్తే అప లేం అంత బాగుంధీ...మీకు ఎవరికైన ఈ బుక్ హార్డ్‌కాపీ గురించి తెలిస్తే చెప్పండి...నాకు కావాలి

by the way here is Manasasanchararey...


తాను రాసిన మరో నోవెల్ శ్రీ కూడా చాలా బాగుంటుంది..