ఎందుకు ఇలా అవుతుంది :(

Tuesday, November 9, 2010

| | | 2 comments


మంచి రోజులు, పండుగ రోజులు అనగానే అందరు పూజ చేసుకుంటారు...నేను ఏంటో రోజు పూజ చేసుకుంటా కానీ అలాంటి స్పెషల్ డేస్ అనగానే ఏదో ఒక మాయరోగం రావడమో లేక బద్దకిన్చడమో చేస్తా....అయ్యో ఇలా చేస్తున్న ఏంటి అనుకుంటూనే బద్దకిస్తాను.....

ఇలా అయినప్పుడు చాల బాధ గా ఉంటుంది.... దేవుడికి కూడా నా మీద కోపం వచ్చేసింది  అని భయం వేస్తుంది....

దేవుడా ఎందుకు ఇలా అవుతుంది చెప్పవా ప్లీజ్..

ఎవరికీ ఎవరు ఈ లోకం లో .....

Monday, November 1, 2010

| | | 5 comments
జీవితం లో ఏది మనకోసం ఆగదు ... ఎవరికీ ఎవరు సొంతం కాదు....ఇలాంటి ఓదార్పు మాటలు చాలా వింటూ ఉంటాం మనం అ నిముషం లో అవి ఎంత ఓదార్పు కలిగిస్తాయో తెలియదు కానీ జీవిత ప్రవాహం లో మనం కూడా కలిసిపోయినప్పుడు...గతం అంత ఒక అనుభవం గా మన ముందు ఉంటుంది..

నాకు ఎంతో ఇష్టమైన పాట ఇక్కడ షేర్ చేస్తున్న.. పాట చాలా అర్ధవంతంగా ఉంటుంది...



జీవితంలో ఈ రోజు నేను ఇంత ఉన్నతం గా నిలబడటానికి అమ్మ నాన్న పెంపకం... చెల్లి తమ్ముడు సహకారం , చదువు చెప్పిన గురువులు.... స్నేహం అంతే తెలియపరిచిన నా బ్లాగ్, facebook అండ్ ఆర్కుట్ ఫ్రెండ్స్...

జస్ట్ వాంటెడ్ టూ థాంక్ యు అల్

జైహింద్

Saturday, August 14, 2010

| | | 7 comments



2 వారాల ముందు నుంచి టీచర్స్ ఇంకా participants హడావిడి తో మొదలు అయ్యి ...choclates తింటూ ఇంటికి వెళ్ళడం తో ముగిసే పండుగ ఆగష్టు 15 అంటే ..

అలా చూడటాలు లేవు...

నేను అసలే చాలా చురుకు అయిన పిల్లని కదా అందుకే ఏ ఆటలోనూ పాలుగోకుండా...అందర్నీ అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని గదమయిస్తూ తిరుగుతూ ఉండటమే స్కూల్ గర్ల్స్ లీడర్ గా నా బాద్యతలు...మరి అంత పెద్ద పోస్ట్ లో ఉండి స్కూల్ లో ఆటల పోటీలు అవి organize చేస్తూ క్లాసు decorations చేస్తూ...చేసినవాటిని పాడు చేసారు అని కంప్లైంట్ ఇచిన వాళ్ళకి పెద్ద రాయుడు ల తీర్పులు చెప్తూ తిరుగుతుంటే ఆ మజా నే వేరు...దేవుడా ఒక్కసారి నీ పుష్పక విమానం ఇస్తే అలా ఒక్కసారి స్కూల్ డేస్ లో కి వెళ్లి మళ్ళి నీ విమానం నీకు పంపించేస్తాను ..

ఆగష్టు 15 నాడు పొద్దునే లేచి ఆ ముందు రోజు రెడీ గా పెట్టుకున్న వైట్ డ్రెస్ వేసుకుని పైనుంచి కింద వరకు అన్ని వైట్ లో మల్లెపూవులా మెరిసిపోతూ జెండా పట్టుకుని చెల్లి తో పాటు స్కూల్ కి వెళ్ళడం....జెండా ఎప్పుడు ఎగరేస్తేరా choclates ఎప్పుడు ఇస్తార అని ఎదురు చూడటం...ఇక్కడ దాక ఏ ఇబ్బంది లేదు ....తర్వాత అదే అటలతోనే ఇబ్బంది ఎందుకు అంటే వైట్ డ్రెస్ కాస్త బ్రౌన్ డ్రెస్ ఇంకా ఏ రంగులు దొరికితేయ్ ఆ రంగులోకి మారిపోతుంది కదా...ఒక వయసు వచ్చే వరకు అమ్మ ఎం అనలేదు ....కానీ ౬థ్ క్లాసు తర్వాత మాతోనే ఉతికించేది ...బట్టలని పెరట్లో బోరింగ్ పంప్ దగ్గర పెట్టుకుని ఉతకడం అదో సరదా...

ఆగష్టు 15 కి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఏంటో...నాకు ఎప్పటికి అర్ధం కానీ విషయం...

ఏది ఏమైనా పుణ్య భూమి నా దేశం నమో నమామి...ధన్య భూమి నా దేశం సదా స్మరామి....జైహింద్. ....జైహింద్.

పుస్తకాలూ

Wednesday, August 11, 2010

| | | 2 comments
పుస్తకాలు చదవడం నాకు ఇష్టం ఇంగ్లీష్ నవలలు తక్కువ కానీ తెలుగు బాగా చదువుతా...ఇప్పటివరకు కొని చదవలేదు వాళ్ళు వీలు ఇచ్చినవి ...online లో...ఇలా గడిపేస్తున్న...చాలా మంది బ్లాగ్గెర్స్ వాళ్ళ బ్లాగ్లో పుస్తకాల గురించి రాసిన reviews చూసి నేను మొన్న కొన్ని బుక్స్ కొన్న...



నెమలికన్ను, ఇల్లేరమ్మ కథలు, మహి, గోదావరి కదలు, సారీ ఖరీదు అండ్ అందమైన అనుభవం

వీటిలో అందమైన అనుభవం చదివాను--- 10th క్లాసు సినిమా స్టొరీ నే...తిట్టుకోవద్దు ఇంత సింపుల్ గా చేప్పేసా అని ...మీలో ఎవరైనా ఈ బుక్ చదివి రివ్యూ రాసి ఉంటెయ్ లేదా రివ్యూ ఎక్కడైనా చదివి ఉంటెయ్ నాకు చెప్పండి సరేనా

మిగతా బుక్స్ కూడా చదివేయ్యాలి ...

09 .08 .2010 నుంచి నేను పుస్తకాల సేకరణ మొదలు పెట్టాను అన్న మాట....సో మంచి పుస్తకాలని సూచించి నా అభిరుచిని పెంపొందించ ప్రార్ధన

మర్చిపోలేని రోజు

Sunday, July 25, 2010

| | | 2 comments


హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి నిన్న వాతావరణం ఎంత బాగుందో ప్రత్యేకం చెప్పకర్లేదు...

నిన్న నా లైఫ్ లో మర్చిపోలేని రోజు గా చేసుకున్న నేను కూడా అనుకోకుండా... నిన్న గురు పౌర్ణమి కదా సో మాములగా పూజ చేసుకుని సండే నే కదా అని గుడికి వెళ్దాం అనుకున్న...అమ్మ ఏమో వర్షం గా ఉంది అంత దూరం ఎందుకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళు ఎక్కడైనా దేవుడే గా అంది ...ముందు కోపం వచ్చిన సరే దగ్గరలో ఏమ్మునాయ అని ఆలోచిస్తున్న ఇంతలో డాడీ గండిపేట్ గుడికి వెళ్ళర అది దగ్గర కదా మనకి అన్నారు...సూపర్ ఐడియా అసలు ..చూట్టు పచ్చని పొలాలు నేను నా బండి మీద అలా అలా చిన్నగా వర్షం పడుతూ...చల్లని గాలులు ..ఇక్కడ మీకు నా బండి గురించి చెప్పాలి...నాది activa వైట్ కలర్.. నాకు అది అంటే చాలా ఇష్టం .. ఆకాశం అంత మబ్బు గా..చిన్నగా వర్షం పడుతూ..నేను ఆ పొలాల మధ్య వైట్ కలర్ బండి మీద వెళ్తుంటే అబ్బో అసలు నేను ఒక పెద్ద హీరోయిన్ల వెళ్తుంటే పల్లిటూరి జనం నన్ను పిచిదాన్ని చూస్తునట్లు చూస్తుంటే ఆహా ఓహో స్వర్గం ఎక్కడో లేదు అంది మన మనసుకి నచ్చిన పని చెయ్యడం లోనే ఉంది అనిపించింది...అలా గండిపేట చేరి బాబా గుడిలో హోమం చేస్తున్తేయ్ కాసేపు కుర్చుని బాబా పక్కనే కాసేపు గడిప....గండిపేట చెరువు ని ఫస్ట్ టైం వాటర్ తో చూసాను కూడా ...తర్వాత సరే ఎటు ఇంట దూరం వచ్చా కదా అని చిలుకూర్ వెళ్ళిపోయ... చిలుకూర్ లో చాలా తక్కువ మంది జనం ఉన్నారు సో దర్శనం వెంటనే అయిపొయింది...చిలుకూర్ వాతావరణం ఫస్ట్ టైం బాగా నచ్చింది... గుడిలో ప్రదక్షిణ చేసే వాళ్ళ మైండ్ ని దేవుడు మీదకి చక్కగా మల్లిస్తూ అక్కడ ఒక పూజారి గారు మంత్రం చెప్పిస్తున్నారు...భక్తులు వచ్చారు వెళ్లారు అనట్లు కాకుండా వాళ్ళ మనసుని దేవుడి మీదకి మళ్ళించడం తమ బాధ్యత గా చేస్తున్న చిలుకూర్ పూజారులు నిజంగా గొప్ప విషయం గా అనిపించింది నాకు...

అక్కడ కొంత మంది పాత ఫ్రెండ్స్ కనిపించారు సో రిటర్న్ లో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్న... నా ఆర్కుట్ లో అప్లోడ్ చేస్తాను లెండి...

నాలో నేను...

Wednesday, July 14, 2010

| | | 6 comments

గత 15 రోజులుగా నాలో నేను ఎంతో మానసిక సంఘర్షణకి(చాల పెద్ద మాట కదు) లోను అవుతున్న ఇంట్లో ఆమ్మ నాన్నలతో మాటలాడలేదు..తిండి తగ్గించేసా ...తెలుసా 5 గ్రామ్స్ బరువు కూడా తగ్గాను...ఇప్పుడు ఇంత సిల్లీగా రాస్తున్న కానీ నిజంగానే చాల ఫీల్ అయ్యాను అండి...ఫైనల్ గా నిన్న నాకు ఎంతో ఇష్టం అయిన బాబా ఫోటో నా డెస్క్ మీద పెట్టుకున్న మరి పిచ్చి ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి అని...అప్పట్నుంచి బాబా వైపు చూస్తున్న అంట సేపు చాల ఓదార్పు గా ఉంది...అసలు చాలా రోజులు అయ్యింది దాన్ని బాగ్ లో పెట్టి డెస్క్ మీద పెట్టుకుందాం అని కానీ మర్చిపొయను పూర్తిగా... నిన్న నాలో నేను ఆలోచించుకుంటున్న ఇప్పుడు నేను వెంటనే నవ్వాలి అంటే నాకు ఇష్టం అయిన పని చెయ్యాలి ఏంటి అది అని...చాటింగ్, బ్రౌజింగ్, రీడింగ్...ఉహు ఏది వర్క్ అవుట్ అవ్వలేదు ఫైనల్ గా బాబా ఫోటో గుర్తు వచ్చింది...ఇప్పుడు నేను చాలా బెటర్ గా ఉన్న....బవిష్యతులో మళ్ళి ఇలాంటి సందర్బం రావచ్చు కానీ నేను మాత్రం ఇంత డెప్రేస్స్ అవ్వను ఖచితం గా ...ఇక్కడ రాసుకోడానికి రిజన్ కూడా అదే ...ఇలాంటి సందర్బం వస్తే చదువుకుంటా ...నా ప్రశ్నలకి ఆలోచనలకి అన్నిటికి సమాధానం దొరికింది..

నన్ను నొర్మల్ గా ఉంచడానికి నా ఫ్రెండ్స్ సింధు, రేణుక, అవంతి, సుష్మ, హేమ సురేష్ గారు వాళ్ళ పనులు మానుకుని మరి నాతో చాట్ చేస్తూ ఎంతో ధైర్యం ని ఇచ్చారు ... మిగతా ఫ్రెండ్స్ కూడా చాలా మంచివారు కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు..నా చూట్టూ చాలా మంచి మనుషులు ఉన్నారు..

ఇంట్లో వాళ్ళకి మాత్రం ఎం చెప్పలేదు కంగారు పడతారు అని ఎందుకంటి నేను ఉన్న సందర్బం నా ఫ్రెండ్స్ సహాయం తో బయటపడగలిగేది కాబట్టి...

ఆఖరికి దేవుడే సాయం చేసాడు....

గమనిక : ఈ పోస్ట్ చదివి ఎం అయ్యింది అని అడగవద్దు(అంత లేకపోతే మరి మంచిది)....ఇప్పుడు బాగున్నాను :D

చందమామ

Tuesday, July 13, 2010

| | | 4 comments

చందమామ బుక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ..నేను చదివిన మొదటి కదల పుస్తకం కూడా అదే ..ఈ మధ్య బ్రౌజ్ చేస్తూ www.chandamama.com చూసాను … సూపర్ ఉంది అందులో చందమామ 1947 జూలై నుంచి Archive చేసి ఉంచారు అన్ని బాషలలో Chandamama మీద క్లిక్ చేసి stories అన్ని చదివేసుకోండి …

1947 నటి పరిస్థితిని కూడా కళ్ళకి కట్టినట్లు ఉంటాయి ఆ editions చదువుతూ ఉంటె ..