నేను ఈ మధ్య ఎక్కువ గా నా ఫోటో బ్లాగ్ లో ఉంటున్నా... అలా గుర్రుగా చూడటాలు లేవు ....
సరే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగండి.. అడగకపోయినా చెప్తా :( బాధ అండి బాధ... ఫోటోలు తీసి బ్లాగ్ పెట్టడం వరకు బాగానే ఉంది...అక్కడనుంచి అందరికి చూపించి నేను పెట్టె హింస ఉంది చూసారు...పాపం నా బ్లాగ్ చూసి బలి అయ్యినవాళ్ళే చెప్పాలి...
బాగుందా అని అడగటం వాళ్ళు మొహమాటానికి బాగుంది అనడం...నేను రెచ్చిపోయి ఇంకో నలుగురికి చూపించడం...అలా మొన్న ఆదివారం మా చెల్లి వాళ్ళ ఆయనికి చూపించా...అక్కడికి అయన నా బాధ పడలేక సీరియస్ గా పని ఉన్నట్లు బిల్డ్ అప్ ఇస్తున్నా..నేను పిలిచి మరి ఒక్కో ఫోటో తీసి చూపిస్తున్నా...అయన మొహం లోకి చూడకుండా ...కాసేపటికి మా చెల్లి వచ్చింది అమ్మ తో సుత్తి ఆపి...వాళ్ళ అయిన మొహం దిగులుగా పెట్టుకుని టీవీ చూస్తున్నారు అంట..ఏంటి అండి ఎం అయ్యింది అని అడిగింది...మీ అక్క ఇందాకట్నుంచి నన్ను హింసిస్తుంది అని కంప్లైంట్..ఏంటి అంటే ఫొటొస్ చూపిస్తుంది ...వాటి మీద నా అభిప్రాయాలూ అడుగుతుంది ..నా మొహం లోకి అసలు చూడటం లేదు ...అదేదో సినిమాలో వేణు తీసిన తోక ఎత్తిన కాకి తోక దించిన కాకి ఫోటో లా ఉన్నాయి అని....అంతే ...నేను చాల బాధ పడ్డాను...
వాళ్ళకి దేవుడు కెమేరా ఐ ఇవ్వలేదు అని సరిపెట్టుకున్న...ఇంకా ఎవరికీ చూపించను కూడా... అందుకే ఫేస్ బుక్ లో లింక్ పెట్టుకుంటున్న...పాపం అప్పుడప్పుడు ఎవరో ఒకరు చూసి బాగుంది అంటున్నారు లెండి...
మీకు చూడాలి అని ఆశ గా ఉంది కదూ , చూడండి మరి - అన్వేషణ
అయ్యో పాపం అనిపిస్తుంది కదూ మీకు కూడా...