అమ్మ పెళ్లి అయిన 4 నెలలకే వాళ్ల నాన్న ఇంకా పెళ్లి కి ముందే మా డ్యాడీ వాళ్ల నాన్న చనిపోయారు ..సో మాకు తాతగారి ప్రేమలు భయాలు తెలియవు..మాకు ఏమో కుళ్లుగా ఉండేది న ఫ్రెండ్స్ వాళ్ల తాతల గురించి చెప్తుంటే..ఇంటికి వచ్చి అమ్మ ని మీ నాన్న ఎందుకు అంత త్వరగా చనిపోయారు అని ఏడ్చేడన్ని..
అమ్మ వాళ్ల నాన్న చిన్న జమీందారు అంట... ఎవరికో హామీ ఉంటే అతను డబ్బులు ఎగ కొట్టాడు అంట ..అందుకని తాతగారు ఆయన ఆస్తి అమ్మెశారు అని..పిల్లలకి అన్యాయం చేశాను అన్న బెంగ తోనే చనిపోయారు అంట..డ్యాడీ వల్ల నాన్న గారు 60 ఏకర్స్ మొతుబరి..గుండెపోటు తో చనిపోయారు అంట..
కానీ మాకు మూతాత . భయం మాత్రం విపరీతం గా ఉండేది..
అమ్మ వాళ్ల తాతగరు మా మామయ్యతో ఉండేవారు…అయిన చాలా స్ట్రిక్ట్…సెపరేట్ రూమ్, పందిరి మంచం, బూరుగు దూధి పరుపు…తెల్లని దొమతెర..ఆయన వంట ఆయనే చేసుకునేవారు ఆయన గ్యాస్ స్టోవ్ మీద వండుకునే వారు మా అత్త ఏమో కర్రల పొయ్య మీద ..మాకు తెలిసినంతవరకు…అయిన ఇంకో 15 డేస్ లో చనిపోతారు అన్నప్పుడు మా అత్తయ్య వండి పెట్టేది..ఆయనికి భోజనం పెట్టడం అంటే ఒక పెద్ద యుద్దం నీట్‌నెస్ ఎక్కువ కొన్ని ఐటమ్స్ తప్పకుండా కావాలి…లైక్ అన్నం వేడి గా ఉండాలి…నెయ్య అండ్ వెన్న తియ్యని మజ్జిగ..అండ్ ఏ పూట కూర ఆ రోజే చెయ్యాలి..ఆయన అన్నం తినే ప్లేట్ 3 కిలోల బరువు ఉండేది దాన్ని మొయ్యడం చాలా కష్టం మా వయుసు(7-8 యియర్స్)కి…ఎవరితోనూ క్లోస్ గా ఉండేవారు కాదు…ముఖ్యం గా మా అత్తతో చాలా సీరీయస్ గా ఉండేవారు..రీసన్ తెలియదు… కానీ అయిన చనిపోయినప్పుడు మాత్రం మా ఇంటికి ఎంత మంది జనం వచ్చారో…అయిన చాలా మంచివారు అంట..బోల్డు దానాలు చేశారు ఆంట చాలా మందిని చదివించారు అంట…అయిన చాలా హైట్ గా ఉండేవారు…పిల్లల్ని ఎం అనేవారు కాదు..అయిన ఎందుకో భయం మా అందరికి మా.. అమ్మతో చాలా కబుర్లు చెప్పేవారు…ఏవో చిన్న చిన్న జ్ఞాపకాలు సరిగా గుర్తు లేవు…
ఇంకా అమ్మమ్మ వల్ల ఫాదర్ గురించి …అబ్బో ఈయన పెద్ద హీరొ…ఈయనికి రాత్రి పూట కళ్ళు కనిపించేవి కావు అయిన బయట తిరుగుతూ పిల్లలు రాకండి పురుగు పట్రా ఉంటాయి అనేవారు…మరి నువ్వు తిరుగుతున్నావ్ గా అంటే అవి నన్ను ఎం చేస్తాయే అనేవారు…ఆయనికి 500ఏకర్స్ పొలం ఉండేది అంట..చాలా మంచి మనిషి అంట ఎంత మంచి మనిషి అంటే ఇప్పుడు మా అమ్మమ్మ వల్ల అన్నయ్య వాళ్ళు ఉండే ఉరు పేరు “లక్ష్మినగార్” ఆయన పేరే నాంట..ఆయన మా అమ్మమ్మ చినప్పుడు ఒక కోతి ని చంపారు అంట…కొతిని చంపితే శాపం వస్తుంది అంట అందుకే పాపం ఆయనికి లాస్ట్ లో 100 ఏకర్స్ నే మిగిలాయి అంట మిగతావి ఎలా పోయాయో తెలియదు…పాండు రోగం వచ్చింది అని అందుకే కళ్ళు పోయాయి ఇది అంత కోతి శాపం నే అని బాధపడేవారు..చాలా ధైర్యం … కళ్ళు కనపడకపోయిన ఏదన్న సౌండ్ వినిపిస్తే చేతి లో కర్ర గిరగిరా తిప్పి విసిరితే గురి తప్పేది కాదు.. మాకు భయం ఎక్కడ మా మీద విసురుతారో అని ...
వాళ్ళు చనిపోయినప్పుడు మాకు అంత ఉహా తెలియదు..కానీ బాగా గుర్తునిద్ర లోనే చనిపోయారు ఇద్దరు కూడా…
0 comments:
Post a Comment