తెలుగులో నాకు సొంతంగా ఒక బ్లాగ్ మొదలుపెట్టాలి అని ఎప్పట్నుంచో అనుకుంటున్న ఇప్పటికీ కుదిరింది .. తప్పకుండా రోజు ఒకటి రాసుకోడానికి ప్రయత్నిస్తాను ... మోహనామురళి ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం...నేను వివాదాలకి దూరం..ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతను...... ..
2 వారాల ముందు నుంచి టీచర్స్ ఇంకా participants హడావిడి తో మొదలు అయ్యి ...choclates తింటూ ఇంటికి వెళ్ళడం తో ముగిసే పండుగ ఆగష్టు 15 అంటే ..
అలా చూడటాలు లేవు...
నేను అసలే చాలా చురుకు అయిన పిల్లని కదా అందుకే ఏ ఆటలోనూ పాలుగోకుండా...అందర్నీ అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని గదమయిస్తూ తిరుగుతూ ఉండటమే స్కూల్ గర్ల్స్ లీడర్ గా నా బాద్యతలు...మరి అంత పెద్ద పోస్ట్ లో ఉండి స్కూల్ లో ఆటల పోటీలు అవి organize చేస్తూ క్లాసు decorations చేస్తూ...చేసినవాటిని పాడు చేసారు అని కంప్లైంట్ ఇచిన వాళ్ళకి పెద్ద రాయుడు ల తీర్పులు చెప్తూ తిరుగుతుంటే ఆ మజా నే వేరు...దేవుడా ఒక్కసారి నీ పుష్పక విమానం ఇస్తే అలా ఒక్కసారి స్కూల్ డేస్ లో కి వెళ్లి మళ్ళి నీ విమానం నీకు పంపించేస్తాను ..
ఆగష్టు 15 నాడు పొద్దునే లేచి ఆ ముందు రోజు రెడీ గా పెట్టుకున్న వైట్ డ్రెస్ వేసుకుని పైనుంచి కింద వరకు అన్ని వైట్ లో మల్లెపూవులా మెరిసిపోతూ జెండా పట్టుకుని చెల్లి తో పాటు స్కూల్ కి వెళ్ళడం....జెండా ఎప్పుడు ఎగరేస్తేరా choclates ఎప్పుడు ఇస్తార అని ఎదురు చూడటం...ఇక్కడ దాక ఏ ఇబ్బంది లేదు ....తర్వాత అదే అటలతోనే ఇబ్బంది ఎందుకు అంటే వైట్ డ్రెస్ కాస్త బ్రౌన్ డ్రెస్ ఇంకా ఏ రంగులు దొరికితేయ్ ఆ రంగులోకి మారిపోతుంది కదా...ఒక వయసు వచ్చే వరకు అమ్మ ఎం అనలేదు ....కానీ ౬థ్ క్లాసు తర్వాత మాతోనే ఉతికించేది ...బట్టలని పెరట్లో బోరింగ్ పంప్ దగ్గర పెట్టుకుని ఉతకడం అదో సరదా...
ఆగష్టు 15 కి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఏంటో...నాకు ఎప్పటికి అర్ధం కానీ విషయం...
ఏది ఏమైనా పుణ్య భూమి నా దేశం నమో నమామి...ధన్య భూమి నా దేశం సదా స్మరామి....జైహింద్. ....జైహింద్.
U knw one thing nenu ippatiki Aug 15 roju white dress vesukuntanu, edo oka road centre lo flag hoisting jarugutadi kada akkadiki veltanu choclates kosam(nijamgaaa), dh adugutaru enti chinna pillalagaa ani kani naku ala cheyyadam nachutundi :)
7 comments:
జైహింద్
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
naaku ee photo choice bhale nacchindi.
Many Many Happy Returns Of The Day
HAPPY INDEPENDENCE DAY.
Sirisha, I wish you a very happy birth day. Have a nice time & enjoy yourself.
thank you niharika and jaya
U knw one thing nenu ippatiki Aug 15 roju white dress vesukuntanu, edo oka road centre lo flag hoisting jarugutadi kada akkadiki veltanu choclates kosam(nijamgaaa), dh adugutaru enti chinna pillalagaa ani kani naku ala cheyyadam nachutundi :)
Post a Comment