ట్రాఫ్ఫిక్ పోలీసు :D

Tuesday, March 8, 2011

| | |


నేను గత 7  సంవత్సరాలు గా బండి నడుపుతున్నా... కానీ లైసెన్సు కి అప్లై చేసింది మాత్రం 6  నెలల క్రితం...ఎప్పుడు ఏ ట్రాఫ్ఫిక్ పోలీసు నన్ను ఆపలేదు లైసెన్సు లేనప్పుడు....లైసెన్సు తిసుకునపట్నుంచి ప్రతి పోలీసు అపెస్తున్నాడు...ఇలా కాదు అని లైసెన్సు ఇంట్లో పెట్టి వచ్చా కొన్ని రోజులు చిత్రం  గా మల్లి ఒక్కడు ఆపలేదు...

ఎందుకు వచ్చిన గోల లే అని లైసెన్సు పెట్టుకుని తిరుగుతున్నా లెండి...

నిన్న నో U turn దగ్గర బండి తిప్పేసా ఎవరు లేరు కదా అని...కానీ అక్కడ ఇద్దరు బాబాయిలు ఉన్నారు...అపబోయి సరే అమ్మాయి కదా అని ఒదిలేసాడు...నేను కుదురుగా ఉండకుండా వెనక్కి వెళ్లి ఏంటి ఆపారు అని అడిగా పెద్ద విజయశాంతి లా... వాడు మీకు ఫైన్ వెయ్యాలి వ్రొంగ్ రూట్ లో వచ్చారు అన్నాడు...నేను ఇచ్చిన  సమాధానం ఉహించండి ఎవరు అయిన?? ..నా దగ్గర డబ్బులు లేవు అండి ...మా డాడీ ఫుల్ ట్యాంక్ చేయిస్తారు ..అమ్మ బాక్స్ లో నూడ్లేస్ పెట్టి ఇస్తుంది  అని చెప్పా అనుకుంటున్నారా??? కాదు
.
.
.
.
.
.
.
.

అవునా నాకు తెలియదు అండి చూసుకోలేదు అక్కడ tyre మార్క్స్ ఉన్నాయి కదా అవి చూసి వచ్చేసా...నేను మొన్న వచ్చినప్పుడు  ఇలా లేదు  అని చెప్పా...వాడు ఒక వెర్రి చూపు చూసి  సర్లే ఈ సారి చూసి వెళ్ళండి అని అన్నాడు....నేను థాంక్స్ చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చా...

4 comments:

said...

ఎంతవారయిన కాంత దాసులే ;-)

రాధిక(నాని ) said...

బాగుందండి.

Sirisha said...

@ radhika: thanks andi

@ Sadharana Pourudu: dasoham emundi andulo...maryada, samsakaram leda jali anukovachu ga :)

Kalpana said...

hahahaa