నిండునదులు పాఱు నిలిచి గంభీరమై

Tuesday, June 19, 2012

| | | 0 comments




నిండునదులు పాఱు నిలిచి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగఁ బొరలి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

తా|| వరదలు లేని రోజులలో నదులు నీటితో నిండియుండి ప్రశాంత గంభీరముగా ప్రవహించును. అట్లే జ్ఞానులైన 


పెద్దలు వివేకముతో ప్రశాంతముగా మాటలాడుదురు. చిన్న సెలయేరు ఒడి దుడుకులతో ఒక్కసారి ఉద్రుతముగా 


ప్రవహించి అన్నిటినీ కూల్చివేయును. అట్లే అల్పు డైన వాడు ఆవేశపడి మాటలాడి కార్యములను చెద గొట్టును .

తనువులస్థిరమని ధనములస్థిరమని

| | | 1 comments








తనువులస్థిరమని ధనములస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ
విశ్వధాభిరామ వినురవేమ

భావము:
ఈ శరీరం,ఈ ధనం అన్నీ అశాశ్వతం అని డాంబికుడు పది మందికీ చెబుతాడే తప్ప,తాను మాత్రం ఆ సత్యాన్ని విశ్వసించి ఆచరించడు. చెప్పడం తేలికే ఆచరించడమే కష్టము అంటున్నాడు ఈ పద్యములో వేమన.చెప్పింది చేసి చూపించేవాడే ఆదర్శ గురువు,కానివాడు మానవ సమాజానికే బరువు అని ఈ పద్య భావము.

క్షేమంగానే ఉన్నా :)

| | | 1 comments

దాదాపు సంవత్సరం అయ్యింది ఈ బ్లాగ్ లో టపా రాసి... ఇవ్వాళా పొద్దున ఫేస్ బుక్ లో నా స్నేహితుడి వేమన శతకం లో ఒక పద్యం షేర్ చేసాడు ....అతను షేర్ చేసిన ఉద్దేశం ఏది అయిన నాకు వెంటనే నేను రోజు ఒకటి చదువుకుంటే  బాగుంటుంది కదా అని అనిపించింది...అందుకే ఈ రోజునుంచి  ఒక వేమన పద్యం నా బ్లాగ్ లో పొందుపర్చుకుంటా ..అలానే ఇంకా బోల్డు కబుర్లు కూడా చెప్పుకుందాం ....