ఎందుకు ఇలా అవుతుంది :(

Tuesday, November 9, 2010

| | | 2 comments


మంచి రోజులు, పండుగ రోజులు అనగానే అందరు పూజ చేసుకుంటారు...నేను ఏంటో రోజు పూజ చేసుకుంటా కానీ అలాంటి స్పెషల్ డేస్ అనగానే ఏదో ఒక మాయరోగం రావడమో లేక బద్దకిన్చడమో చేస్తా....అయ్యో ఇలా చేస్తున్న ఏంటి అనుకుంటూనే బద్దకిస్తాను.....

ఇలా అయినప్పుడు చాల బాధ గా ఉంటుంది.... దేవుడికి కూడా నా మీద కోపం వచ్చేసింది  అని భయం వేస్తుంది....

దేవుడా ఎందుకు ఇలా అవుతుంది చెప్పవా ప్లీజ్..

ఎవరికీ ఎవరు ఈ లోకం లో .....

Monday, November 1, 2010

| | | 5 comments
జీవితం లో ఏది మనకోసం ఆగదు ... ఎవరికీ ఎవరు సొంతం కాదు....ఇలాంటి ఓదార్పు మాటలు చాలా వింటూ ఉంటాం మనం అ నిముషం లో అవి ఎంత ఓదార్పు కలిగిస్తాయో తెలియదు కానీ జీవిత ప్రవాహం లో మనం కూడా కలిసిపోయినప్పుడు...గతం అంత ఒక అనుభవం గా మన ముందు ఉంటుంది..

నాకు ఎంతో ఇష్టమైన పాట ఇక్కడ షేర్ చేస్తున్న.. పాట చాలా అర్ధవంతంగా ఉంటుంది...



జీవితంలో ఈ రోజు నేను ఇంత ఉన్నతం గా నిలబడటానికి అమ్మ నాన్న పెంపకం... చెల్లి తమ్ముడు సహకారం , చదువు చెప్పిన గురువులు.... స్నేహం అంతే తెలియపరిచిన నా బ్లాగ్, facebook అండ్ ఆర్కుట్ ఫ్రెండ్స్...

జస్ట్ వాంటెడ్ టూ థాంక్ యు అల్

జైహింద్

Saturday, August 14, 2010

| | | 7 comments



2 వారాల ముందు నుంచి టీచర్స్ ఇంకా participants హడావిడి తో మొదలు అయ్యి ...choclates తింటూ ఇంటికి వెళ్ళడం తో ముగిసే పండుగ ఆగష్టు 15 అంటే ..

అలా చూడటాలు లేవు...

నేను అసలే చాలా చురుకు అయిన పిల్లని కదా అందుకే ఏ ఆటలోనూ పాలుగోకుండా...అందర్నీ అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని గదమయిస్తూ తిరుగుతూ ఉండటమే స్కూల్ గర్ల్స్ లీడర్ గా నా బాద్యతలు...మరి అంత పెద్ద పోస్ట్ లో ఉండి స్కూల్ లో ఆటల పోటీలు అవి organize చేస్తూ క్లాసు decorations చేస్తూ...చేసినవాటిని పాడు చేసారు అని కంప్లైంట్ ఇచిన వాళ్ళకి పెద్ద రాయుడు ల తీర్పులు చెప్తూ తిరుగుతుంటే ఆ మజా నే వేరు...దేవుడా ఒక్కసారి నీ పుష్పక విమానం ఇస్తే అలా ఒక్కసారి స్కూల్ డేస్ లో కి వెళ్లి మళ్ళి నీ విమానం నీకు పంపించేస్తాను ..

ఆగష్టు 15 నాడు పొద్దునే లేచి ఆ ముందు రోజు రెడీ గా పెట్టుకున్న వైట్ డ్రెస్ వేసుకుని పైనుంచి కింద వరకు అన్ని వైట్ లో మల్లెపూవులా మెరిసిపోతూ జెండా పట్టుకుని చెల్లి తో పాటు స్కూల్ కి వెళ్ళడం....జెండా ఎప్పుడు ఎగరేస్తేరా choclates ఎప్పుడు ఇస్తార అని ఎదురు చూడటం...ఇక్కడ దాక ఏ ఇబ్బంది లేదు ....తర్వాత అదే అటలతోనే ఇబ్బంది ఎందుకు అంటే వైట్ డ్రెస్ కాస్త బ్రౌన్ డ్రెస్ ఇంకా ఏ రంగులు దొరికితేయ్ ఆ రంగులోకి మారిపోతుంది కదా...ఒక వయసు వచ్చే వరకు అమ్మ ఎం అనలేదు ....కానీ ౬థ్ క్లాసు తర్వాత మాతోనే ఉతికించేది ...బట్టలని పెరట్లో బోరింగ్ పంప్ దగ్గర పెట్టుకుని ఉతకడం అదో సరదా...

ఆగష్టు 15 కి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఏంటో...నాకు ఎప్పటికి అర్ధం కానీ విషయం...

ఏది ఏమైనా పుణ్య భూమి నా దేశం నమో నమామి...ధన్య భూమి నా దేశం సదా స్మరామి....జైహింద్. ....జైహింద్.

పుస్తకాలూ

Wednesday, August 11, 2010

| | | 2 comments
పుస్తకాలు చదవడం నాకు ఇష్టం ఇంగ్లీష్ నవలలు తక్కువ కానీ తెలుగు బాగా చదువుతా...ఇప్పటివరకు కొని చదవలేదు వాళ్ళు వీలు ఇచ్చినవి ...online లో...ఇలా గడిపేస్తున్న...చాలా మంది బ్లాగ్గెర్స్ వాళ్ళ బ్లాగ్లో పుస్తకాల గురించి రాసిన reviews చూసి నేను మొన్న కొన్ని బుక్స్ కొన్న...



నెమలికన్ను, ఇల్లేరమ్మ కథలు, మహి, గోదావరి కదలు, సారీ ఖరీదు అండ్ అందమైన అనుభవం

వీటిలో అందమైన అనుభవం చదివాను--- 10th క్లాసు సినిమా స్టొరీ నే...తిట్టుకోవద్దు ఇంత సింపుల్ గా చేప్పేసా అని ...మీలో ఎవరైనా ఈ బుక్ చదివి రివ్యూ రాసి ఉంటెయ్ లేదా రివ్యూ ఎక్కడైనా చదివి ఉంటెయ్ నాకు చెప్పండి సరేనా

మిగతా బుక్స్ కూడా చదివేయ్యాలి ...

09 .08 .2010 నుంచి నేను పుస్తకాల సేకరణ మొదలు పెట్టాను అన్న మాట....సో మంచి పుస్తకాలని సూచించి నా అభిరుచిని పెంపొందించ ప్రార్ధన

మర్చిపోలేని రోజు

Sunday, July 25, 2010

| | | 2 comments


హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి నిన్న వాతావరణం ఎంత బాగుందో ప్రత్యేకం చెప్పకర్లేదు...

నిన్న నా లైఫ్ లో మర్చిపోలేని రోజు గా చేసుకున్న నేను కూడా అనుకోకుండా... నిన్న గురు పౌర్ణమి కదా సో మాములగా పూజ చేసుకుని సండే నే కదా అని గుడికి వెళ్దాం అనుకున్న...అమ్మ ఏమో వర్షం గా ఉంది అంత దూరం ఎందుకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళు ఎక్కడైనా దేవుడే గా అంది ...ముందు కోపం వచ్చిన సరే దగ్గరలో ఏమ్మునాయ అని ఆలోచిస్తున్న ఇంతలో డాడీ గండిపేట్ గుడికి వెళ్ళర అది దగ్గర కదా మనకి అన్నారు...సూపర్ ఐడియా అసలు ..చూట్టు పచ్చని పొలాలు నేను నా బండి మీద అలా అలా చిన్నగా వర్షం పడుతూ...చల్లని గాలులు ..ఇక్కడ మీకు నా బండి గురించి చెప్పాలి...నాది activa వైట్ కలర్.. నాకు అది అంటే చాలా ఇష్టం .. ఆకాశం అంత మబ్బు గా..చిన్నగా వర్షం పడుతూ..నేను ఆ పొలాల మధ్య వైట్ కలర్ బండి మీద వెళ్తుంటే అబ్బో అసలు నేను ఒక పెద్ద హీరోయిన్ల వెళ్తుంటే పల్లిటూరి జనం నన్ను పిచిదాన్ని చూస్తునట్లు చూస్తుంటే ఆహా ఓహో స్వర్గం ఎక్కడో లేదు అంది మన మనసుకి నచ్చిన పని చెయ్యడం లోనే ఉంది అనిపించింది...అలా గండిపేట చేరి బాబా గుడిలో హోమం చేస్తున్తేయ్ కాసేపు కుర్చుని బాబా పక్కనే కాసేపు గడిప....గండిపేట చెరువు ని ఫస్ట్ టైం వాటర్ తో చూసాను కూడా ...తర్వాత సరే ఎటు ఇంట దూరం వచ్చా కదా అని చిలుకూర్ వెళ్ళిపోయ... చిలుకూర్ లో చాలా తక్కువ మంది జనం ఉన్నారు సో దర్శనం వెంటనే అయిపొయింది...చిలుకూర్ వాతావరణం ఫస్ట్ టైం బాగా నచ్చింది... గుడిలో ప్రదక్షిణ చేసే వాళ్ళ మైండ్ ని దేవుడు మీదకి చక్కగా మల్లిస్తూ అక్కడ ఒక పూజారి గారు మంత్రం చెప్పిస్తున్నారు...భక్తులు వచ్చారు వెళ్లారు అనట్లు కాకుండా వాళ్ళ మనసుని దేవుడి మీదకి మళ్ళించడం తమ బాధ్యత గా చేస్తున్న చిలుకూర్ పూజారులు నిజంగా గొప్ప విషయం గా అనిపించింది నాకు...

అక్కడ కొంత మంది పాత ఫ్రెండ్స్ కనిపించారు సో రిటర్న్ లో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్న... నా ఆర్కుట్ లో అప్లోడ్ చేస్తాను లెండి...

నాలో నేను...

Wednesday, July 14, 2010

| | | 6 comments

గత 15 రోజులుగా నాలో నేను ఎంతో మానసిక సంఘర్షణకి(చాల పెద్ద మాట కదు) లోను అవుతున్న ఇంట్లో ఆమ్మ నాన్నలతో మాటలాడలేదు..తిండి తగ్గించేసా ...తెలుసా 5 గ్రామ్స్ బరువు కూడా తగ్గాను...ఇప్పుడు ఇంత సిల్లీగా రాస్తున్న కానీ నిజంగానే చాల ఫీల్ అయ్యాను అండి...ఫైనల్ గా నిన్న నాకు ఎంతో ఇష్టం అయిన బాబా ఫోటో నా డెస్క్ మీద పెట్టుకున్న మరి పిచ్చి ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి అని...అప్పట్నుంచి బాబా వైపు చూస్తున్న అంట సేపు చాల ఓదార్పు గా ఉంది...అసలు చాలా రోజులు అయ్యింది దాన్ని బాగ్ లో పెట్టి డెస్క్ మీద పెట్టుకుందాం అని కానీ మర్చిపొయను పూర్తిగా... నిన్న నాలో నేను ఆలోచించుకుంటున్న ఇప్పుడు నేను వెంటనే నవ్వాలి అంటే నాకు ఇష్టం అయిన పని చెయ్యాలి ఏంటి అది అని...చాటింగ్, బ్రౌజింగ్, రీడింగ్...ఉహు ఏది వర్క్ అవుట్ అవ్వలేదు ఫైనల్ గా బాబా ఫోటో గుర్తు వచ్చింది...ఇప్పుడు నేను చాలా బెటర్ గా ఉన్న....బవిష్యతులో మళ్ళి ఇలాంటి సందర్బం రావచ్చు కానీ నేను మాత్రం ఇంత డెప్రేస్స్ అవ్వను ఖచితం గా ...ఇక్కడ రాసుకోడానికి రిజన్ కూడా అదే ...ఇలాంటి సందర్బం వస్తే చదువుకుంటా ...నా ప్రశ్నలకి ఆలోచనలకి అన్నిటికి సమాధానం దొరికింది..

నన్ను నొర్మల్ గా ఉంచడానికి నా ఫ్రెండ్స్ సింధు, రేణుక, అవంతి, సుష్మ, హేమ సురేష్ గారు వాళ్ళ పనులు మానుకుని మరి నాతో చాట్ చేస్తూ ఎంతో ధైర్యం ని ఇచ్చారు ... మిగతా ఫ్రెండ్స్ కూడా చాలా మంచివారు కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు..నా చూట్టూ చాలా మంచి మనుషులు ఉన్నారు..

ఇంట్లో వాళ్ళకి మాత్రం ఎం చెప్పలేదు కంగారు పడతారు అని ఎందుకంటి నేను ఉన్న సందర్బం నా ఫ్రెండ్స్ సహాయం తో బయటపడగలిగేది కాబట్టి...

ఆఖరికి దేవుడే సాయం చేసాడు....

గమనిక : ఈ పోస్ట్ చదివి ఎం అయ్యింది అని అడగవద్దు(అంత లేకపోతే మరి మంచిది)....ఇప్పుడు బాగున్నాను :D

చందమామ

Tuesday, July 13, 2010

| | | 4 comments

చందమామ బుక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ..నేను చదివిన మొదటి కదల పుస్తకం కూడా అదే ..ఈ మధ్య బ్రౌజ్ చేస్తూ www.chandamama.com చూసాను … సూపర్ ఉంది అందులో చందమామ 1947 జూలై నుంచి Archive చేసి ఉంచారు అన్ని బాషలలో Chandamama మీద క్లిక్ చేసి stories అన్ని చదివేసుకోండి …

1947 నటి పరిస్థితిని కూడా కళ్ళకి కట్టినట్లు ఉంటాయి ఆ editions చదువుతూ ఉంటె ..

ఎన్నాల్లో వేచిన ఉదయం...

Sunday, July 11, 2010

| | | 2 comments
టైటల్ చూసి ఎంటా అనుకుంటున్నారా…నాకు బొమ్మలు వెయ్యడం అంటే చాలా ఇష్టం కానీ నేను వేస్తే వాటిని చూసి జనాలు పడే కష్టం చూడలేక కామ్ గా ఉన్నా…నిన్న అంత ఆఫీస్ లో పని ఎం లేదు సో నాలో ఆర్టిస్ట్ వెర్రి తలలు వేసింది ఫలితంగా కొన్ని కళాకాండలు బయటపడ్డాయి…తిట్టుకోకుండా ఎంజాయ్ చెయ్యండి…ఐ డాక్టర్ దగ్గర అపాయంట్‌మెంట్ తీసుకోండి ఓక్ నా….

ఇధి పువ్వు

ఇది మా ఒఫీసే బోయ్ ( ఇంకా వాడికి చూపించలేదు చూపిస్తే నా దగ్గరికి కూడా రాడు)

ఇది నేను

ఇది ప్రకృతి


ప్రతిదీ ఎందుకు చెప్తున్న అంటే చెప్పకపోతే మీరు మళ్లీ బుర్ర కి పని పెట్టాలి కదా

ఆకాశవాణి వివిధ భారతి

Wednesday, July 7, 2010

| | | 1 comments


రేడియో ఎంత మంది వింటారు రోజు …నేను చాలా అరుదుగా నా మూడ్ బాగోనప్పుడు డ్రైవ్ చేయాల్సి వస్తీ ఏకాగ్రత కోసం అంటెయ్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఆలోచించకుండా పాటలు వింటాను అన్న మాట …అప్పుడు నా ఛాయస్ 93.5 SFM…98.3 అసలు నచ్చదు నాకు adds చాలా ఎక్కువ ....వాగుడు ఎక్కువగా ఉంటుంది ...93.5 sfm కూడా అలానే అనిపిస్తుంది కానీ ఎం చేస్తాం.. అరేయ్ అసలే చిరాకుగా ఉంది ఈ సాంగ్స్ కాకుండా పాత సాంగ్స్ వేస్తె …సోది ఎక్కువ చెప్పకుండా ఉంటెయ్ adds లేకుండా ఉంటెయ్ ఎంత బాగుండు అని ఎన్నిసార్లు అనుకునే దాన్నో …ఒకప్పటి ఆకాశవాణి గురించి తెలుసు కానీ నాకు తెలియదు ఇంకా ఉంది అని ..మొన్న ఏదో అలా fm వింటూ చానల్స్ మర్స్తున్నమారుస్తూ ఉంటెయ్ …ఒక చక్కని పాత పాట కుశలమా నీవు కుసలేమేయ్ కదా అంటూ సూపర్ సాంగ్ వచ్చింది …అరేయ్ ఏంటి fm నుంచి న mp3 లోకి ఎలా వెళ్ళింది అని చూస్తె అది ఒక రేడియో ఛానల్ 102.8 అబ్బ నిజంగా పాట అయిన వెంటనే పాట అలా వరసగా 3 పాటలు వాచక అప్పుడు ఆకాశవాణి వివిధ భారతి అని వినిపించింది.. చాలా బాగుంది అది ఎక్కువ ప్రకటనలు లేవు ఎంకేర్స్ సోది వాగుడు లేదు ..

నాకు ఐతే బాగా నచ్చింది తెలియని వాళ్ళు ఉంటె ఫాలో అవుతారు అని మీతో పంచుకుంటున్న...

నాన్న

Monday, July 5, 2010

| | | 4 comments



నేను చెల్లి పుట్టగానే లక్ష్మి దేవి పుట్టింది అని మురిసిపోయారు అంట నాన్న మీరు..
ఒక అబ్బాయి ఉండాలి అని తమ్ముడు కోసం ఆగారు అంట..మేము పిల్లలాగా ఆగారు ఈ రోజు వరకు మా సంరక్షణ మా అలన పాలనా అమ్మతో సమానంగా కాదు అమ్మకన్నా ఎక్కువుగా మీరే చూస్తున్నారు...
మాకు స్నానం చేయించడం ఈ ఉరు వెళ్ళిన మా కోసం ఏవో ఒకటి తీసుకు రావడం...తమ్ముడు రాత్రి పూట మీరు వచ్చేవరకు నిద్రపోయేవాడు కాదు వాడిని ఒక రౌండ్ బుల్లెట్ మీద తిప్పితేయ్ కానీ ఎంత అలసి పోయిన మీరు మమల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు...చెల్లి చాలా కలుపుగోలుగా అందరితో ఉండేది...నేను ఎలా బతుకుతానో మీరు ఎప్పుడు అనేవారు ఇప్పటికి అంటున్నారు అనుకోండి...మీరు అలా అనప్పుడు అల్లా నాకు ఏంటి అనుకునేదాన్ని కానీ...ఈ లోకం లో మీ తోడు లేనిదే బతకడం నా వల్ల కాదు ...
ప్రతి నెల మీరు బండి మీద మమల్ని బీచ్ కి తీసుకువెళ్ళి రోజు అంత అక్కడ గడిపి రావడం ఇంకా కళ్ళలో మెదులుతుంది...
స్కూల్ లో ఒక అబ్బాయి ఎడిపిస్తున్నాడు ani మీరు ఆ అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్లి ఇదేనా పెంపకం అని తిట్టడం ఇంకా గుర్తు ఉంది...
నా క్లాసు మేట్స్ మిమ్మల్ని హిట్లేర్ అని పిలవడం...వాళ్ళు ఇప్పటికి అలానే అంటారు...
అరచేతిలో పెట్టుకుని పెంచుకున్నారు మీరు మమల్ని..నాకు కష్టం కలిగినప్పుడు మీ బాధని అర్ధం చేసుకోకుండా మిమ్మల్ని తిట్టినా కడుపులో పెట్టి దాచుకున్నారు...

మీ బిడ్డలగా పుట్టడం మా అదృష్టం.. ఎప్పటికి నీ కుతురుగానే పుట్టాలి అని కోరుకుంటా .... అమ్మతో సమానంగా కాదు అమ్మకన్నా ఎక్కువుగా చూసుకున్న మీ పాదాలకు నమస్కరిస్తూ...

మీ
పెద్దమ్మాయి

నా సాహసాలు

Friday, July 2, 2010

| | | 4 comments

నేను పుట్టి అప్పటికీ 4 నెలలు అయ్యింది అప్పట్లో డాడ్ కి బుల్లెట్ ఉండేది..డాడ్ వాళ్ల ఉరీనుంచి అమ్మ వాళ్ల ఇంటికి వెళ్తుంది…అమ్మకి పిల్లల్ని ఎత్తుకుని బండి మీద కూర్చోడం ఫర్స్ట్ టైమ్ అన్న మాట…నన్ను టర్కీ టవల్ లో జాగర్త గా చూట్టి పట్టుకుని కూర్చుంది అంట డాడ్ అమ్మ మేఘాలలో తెలిపొమ్మని పాట పాడుకుంటూ వస్తున్నారు…ఇంకా మామయ్య వాళ్ల ఉరు 5కేయెమ్ ఉంది అనగా అక్కడ చెట్టు కింద ఆంజనేయ స్వమయ్ గుడి ఉంది..అక్కడ డాడ్ బండి కి గేదలు అడ్డం వస్తే బ్రేక్ వేశారు అంట అమ్మ డామ్ అని కింద పడటం నేను ఎగిరి తుప్పలలో పడటం అంత స్ప్లిట్ ఆఫ్ సెకెండ్స్ లో అయ్యీపోయింది అంట డాడ్ వెంటనే లేచి అమ్మని లేపి పాప ఎక్కడ అని చూట్టు చూసుకుంటే మనం తుప్పలొ ఉన్నాం హ్యాపీ గా…మరి ఏమైందో నన్ను దగ్గరకి తీసుకుని దెబ్బలు ఎం లేవు అని అనుకున్నారు కానీ నేను ఉలుకు ఏడుపు లేకుండా పడి ఉన్న..అమ్మ కి ఏమైందో అర్ధం కాక ఏడుపు స్టార్ట్ నన్ను గుడి లో దేవుడు ముందు పెట్టి ఏడుపు ఆంట ఈలోగా నేను బ్యార్ర్ర్ర్ మని లేచా మరి తీసుకెళ్ళి కింద పడుకో పెట్టింది చీమ గట్టిగా ఒక ముద్దు పెట్టింది…ఇంకా అమ్మ కి నేను ఏద్చను అని ఎంత సంబర పడిందో ఆంట…ఇప్పటికీ చెప్తుంది నువ్వు పడింది ఇక్కడే నే అని….

అప్పుడు నాకు 4-5 యియర్స్ ఏజ్ ఉంటుంది…మామయ్య వాళ్ల ఇంటికి వెళ్ళాం ఏదో పండగకి…మామయ్య కు ఇద్దరు ఆమ్యాయూలు…మేము ఇద్దరము…నల్లుగురం కలిసి ఇల్లు పీకి పందిరి వేసే వాళ్ళం…ఒక రోజు ఈవ్నింగ్..బయట వాకిలి లో నవారు మంచం వేశారు కూర్చోడానికి అని…మేము దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆటలు మొదలు పెట్టాం..మా మామయ్య వల్ల పెద్ద అమ్మాయి సునీత లేచి మంచం మీద ఒక మూల నుంచుని ముందుకు దుకింది అన్న మాట అలా పడటం లో నవారు మంచం కావడం తో కొంచెం పైకి లేచి మళ్లీ పడింది ఇంకా మేము ముగ్గురం స్టార్ట్ చేశాం అలా పడటం…వాళ్ళు అంటే బక్క పిల్లలు పడితే లెస్తరు మనం కొంచెం లడ్డూస్ కదా పడటం పడటం మళ్లీ లేవలేదు లెఫ్ట్ హాండ్ కి రాడ్ తగిలింది….అంతే ఏడుపు స్టార్ట్…అమ్మ వాళ్ళు చూసి చెయ్య విరిగినట్లు ఉంది అని రిక్క్షా లో హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు …మామయ్య వల్ల ఉరిళో హాస్పిటల్ లేదు అప్పట్లో 25కేయెమ్ వెళ్ళాలి హాస్పిటల్ కోసం…ఈ దారి అంత నేను ఏడుస్తూనే ఉన్న…అమ్మ వాళ్ళు ఓదార్చడానికి తినమని ఏదో ఒకటి ఇవ్వడం నేను అవి తింతూనే ఏద్చను అంట…

డాక్టర్ దగ్గరికి తీసుకు వచ్చారు ఆయన కట్టు వెయ్యాలి ఇంజెక్షన్ చెయ్యాలి అన్నారు…మనకి ఇంజెక్షన్ అంటే భయం ఇంకా నేను కాళ్ళు టప టప కొడుతూ బెడ్ మీద ఒకటే ఏడుపు..నా ఏడుపు కి అలా కదులుతూ ఉంటే ఆయన కట్టు వెయ్యలెక చిరాకు వచ్చి నట్లు ఉంది పాపం…నర్స్ ని పిలిచి ఈ పిల్ల కాళ్ళా దగ్గర సూధులు పట్టుకు నుంచో కదిలితే అవి . అప్పుడు తెలుస్తుంది అని అన్నారు అంటే నేను ఇంకా ఫ్రీగే అయిపోయ…

ఈ ఇన్సిడెంట్ అమ్మ అందరికి చెప్పి తెగ్గ నవ్వేదీ…అందరు అలానే నవ్వెవారు బండ పిల్ల అని..

తర్వాత 5వ క్లాస్ కి వచ్చాక సైకల్ నేర్చుకోవడం స్టార్ట్ చేసా ఏవెరీ హెల్ప్ లేకుండా బాగానే నేర్చుకున్న అబ్బాయాల్తో పోటీ పడి మరి తొక్కెదన్ని..వాళ్ళు సీట్ మీద కూర్చోకుండా నుంచుని తొక్కెవాళ్ళు ఆది నాకు కొంచెం కష్టం గా ఉండేది...ఒకరోజు ఆది వచ్చేసింది ఆ ఆనంధం లో చాల్ ఫాస్ట్ గా తొక్కుతున్న... స్పీడ్ బ్రేకర్ ని గమనించ లేదుకాళ్ళు కి గట్టిగా తగిలింది..గోరు ఉడిపోయింది..

తర్వాత 7త్ క్లాస్ లో లూన...మా అంకల్ ది నేర్పమని ఎన్ని సార్లు అడిగిన ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అనేవారు...ఒక రోజు నేను కీస్ తీసుకుని స్టార్ట్ చేసేసా ఆది పరుగు స్టార్ట్ చేసింది నేను బండి ఎక్కలేదు దానితో పాటు పరెగెత్తి కాసేపాటికీ బల్బ్ వెలిగి బ్రేక్ వేసి నా కోసమే ఎదురు చూస్తున్న బురద లో పడిపోయాను..పైకి లేచి బండి తీసుకుని ఇంటికి వెళ్ళి అంకల్ మీ బండి బాగాలేదు నాకు ఒద్దు అని కీస్ ఇచ్చెసా..నువ్వు కీస్ ఎప్పుడు తీసుకున్నావ్ అని బయటికి వచ్చి బండి చూసుకుని ఎం జరిగిందో తెలుస్కుని ఒకటే నవ్వు...తర్వాత బండి నేర్చుకోడం మా చెల్లి ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా అని తీసుకెళ్ళి రెండు సార్లు పడేశాను...ఏమైన మా చెల్లికి ధైర్యం ఎక్కువ ఫర్స్ట్ టైమ్ పడ్డా కూడా సెకెండ్ టైమ్ నా బండి ధైర్యం గా ఎక్కింది...ఇంకా తర్వాత భయపడుతూనే ఎక్కుతుంది ఆది వేరే విషయం..

ఫైనల్ గా కాలేజ్ లో నా ఫ్రెండ్ ఉమ కొత్త స్పిరిట్ బండి...నాకు చాలా హెడేక్ గా ఉంది ట్యాబ్‌లెట్ కోసం వెళ్తను అని బండి తీసుకున్న ట్యాబ్‌లెట్ కొని రిటర్న్ అవుతూంటే ముసలి ఆయన ఒకరు అడ్డం వచ్చేశారు సడన్ గా ఆయనకోసం నేను సడన్ బ్రేక్ వేశా నేను కింద బండి నా మీద ఆ ముసలి ఆయన అయ్యో అలా పడిపోయవ్ ఏంటి అని జాలి ...కాళ్ళు పట్టేసింది ..ఆది పాత నొప్పి కింద ఉండిపోయింది ఇప్పటికీ తగ్గలేదు ఎప్పుడైనా గుర్తు చేస్తుంటుంది...

ఇవి నా సాహసాలు...

తాతలు

| | | 0 comments



అమ్మ పెళ్లి అయిన 4 నెలలకే వాళ్ల నాన్న ఇంకా పెళ్లి కి ముందే మా డ్యాడీ వాళ్ల నాన్న చనిపోయారు ..సో మాకు తాతగారి ప్రేమలు భయాలు తెలియవు..మాకు ఏమో కుళ్లుగా ఉండేది న ఫ్రెండ్స్ వాళ్ల తాతల గురించి చెప్తుంటే..ఇంటికి వచ్చి అమ్మ ని మీ నాన్న ఎందుకు అంత త్వరగా చనిపోయారు అని ఏడ్చేడన్ని..

అమ్మ వాళ్ల నాన్న చిన్న జమీందారు అంట... ఎవరికో హామీ ఉంటే అతను డబ్బులు ఎగ కొట్టాడు అంట ..అందుకని తాతగారు ఆయన ఆస్తి అమ్మెశారు అని..పిల్లలకి అన్యాయం చేశాను అన్న బెంగ తోనే చనిపోయారు అంట..డ్యాడీ వల్ల నాన్న గారు 60 ఏకర్స్ మొతుబరి..గుండెపోటు తో చనిపోయారు అంట..

కానీ మాకు మూతాత . భయం మాత్రం విపరీతం గా ఉండేది..

అమ్మ వాళ్ల తాతగరు మా మామయ్యతో ఉండేవారు…అయిన చాలా స్ట్రిక్ట్…సెపరేట్ రూమ్, పందిరి మంచం, బూరుగు దూధి పరుపు…తెల్లని దొమతెర..ఆయన వంట ఆయనే చేసుకునేవారు ఆయన గ్యాస్ స్టోవ్ మీద వండుకునే వారు మా అత్త ఏమో కర్రల పొయ్య మీద ..మాకు తెలిసినంతవరకు…అయిన ఇంకో 15 డేస్ లో చనిపోతారు అన్నప్పుడు మా అత్తయ్య వండి పెట్టేది..ఆయనికి భోజనం పెట్టడం అంటే ఒక పెద్ద యుద్దం నీట్‌నెస్ ఎక్కువ కొన్ని ఐటమ్స్ తప్పకుండా కావాలి…లైక్ అన్నం వేడి గా ఉండాలి…నెయ్య అండ్ వెన్న తియ్యని మజ్జిగ..అండ్ ఏ పూట కూర ఆ రోజే చెయ్యాలి..ఆయన అన్నం తినే ప్లేట్ 3 కిలోల బరువు ఉండేది దాన్ని మొయ్యడం చాలా కష్టం మా వయుసు(7-8 యియర్స్)కి…ఎవరితోనూ క్లోస్ గా ఉండేవారు కాదు…ముఖ్యం గా మా అత్తతో చాలా సీరీయస్ గా ఉండేవారు..రీసన్ తెలియదు… కానీ అయిన చనిపోయినప్పుడు మాత్రం మా ఇంటికి ఎంత మంది జనం వచ్చారో…అయిన చాలా మంచివారు అంట..బోల్డు దానాలు చేశారు ఆంట చాలా మందిని చదివించారు అంట…అయిన చాలా హైట్ గా ఉండేవారు…పిల్లల్ని ఎం అనేవారు కాదు..అయిన ఎందుకో భయం మా అందరికి మా.. అమ్మతో చాలా కబుర్లు చెప్పేవారు…ఏవో చిన్న చిన్న జ్ఞాపకాలు సరిగా గుర్తు లేవు…

ఇంకా అమ్మమ్మ వల్ల ఫాదర్ గురించి …అబ్బో ఈయన పెద్ద హీరొ…ఈయనికి రాత్రి పూట కళ్ళు కనిపించేవి కావు అయిన బయట తిరుగుతూ పిల్లలు రాకండి పురుగు పట్రా ఉంటాయి అనేవారు…మరి నువ్వు తిరుగుతున్నావ్ గా అంటే అవి నన్ను ఎం చేస్తాయే అనేవారు…ఆయనికి 500ఏకర్స్ పొలం ఉండేది అంట..చాలా మంచి మనిషి అంట ఎంత మంచి మనిషి అంటే ఇప్పుడు మా అమ్మమ్మ వల్ల అన్నయ్య వాళ్ళు ఉండే ఉరు పేరు “లక్ష్మినగార్” ఆయన పేరే నాంట..ఆయన మా అమ్మమ్మ చినప్పుడు ఒక కోతి ని చంపారు అంట…కొతిని చంపితే శాపం వస్తుంది అంట అందుకే పాపం ఆయనికి లాస్ట్ లో 100 ఏకర్స్ నే మిగిలాయి అంట మిగతావి ఎలా పోయాయో తెలియదు…పాండు రోగం వచ్చింది అని అందుకే కళ్ళు పోయాయి ఇది అంత కోతి శాపం నే అని బాధపడేవారు..చాలా ధైర్యం … కళ్ళు కనపడకపోయిన ఏదన్న సౌండ్ వినిపిస్తే చేతి లో కర్ర గిరగిరా తిప్పి విసిరితే గురి తప్పేది కాదు.. మాకు భయం ఎక్కడ మా మీద విసురుతారో అని ...

వాళ్ళు చనిపోయినప్పుడు మాకు అంత ఉహా తెలియదు..కానీ బాగా గుర్తునిద్ర లోనే చనిపోయారు ఇద్దరు కూడా…

అమ్మో ఆడపిల్లలు

Thursday, July 1, 2010

| | | 4 comments



నిజం అమ్మాయి అయ్యి ఉండి అలా అంటావ్ ఏంటి అని అడగకండి నా బాదలు నావి...

వివరం గా రాస్తాను చదవండి (బలవంతం ఎం లేదు)

చినప్పుడు నేను 1స్ట్ క్లాస్ నుంచి 10త్ క్లాస్ వరకు ఒకటే స్కూల్... ఇంగ్లీష్ మీడియమ్ అండ్ తెలుగు మీడియమ్ క్లబ్ చేసి క్లాసస్ చెప్పిన మా ఇంగ్లీష్ మీడియమ్ లో 6 మెంబర్స్ మీ ఉండేవాళ్ళం నలుగురు అబ్బాయులు అండ్ ఇద్దరం అమ్మాయాలం..చిన్న చిన్న మ్యాటర్స్ పక్కన పెడితే నేను ఇబ్బంది పడ్డ విషయాలు చెప్తాను...10 క్లాస్ లో ఒక రోజు లంచ్ అయ్యాక ఉసిరి చెట్టు కింద కాయలు తింటూ నేను నాగమణి కబుర్లు చెప్పుకుంటున్నాం.. ఏదో మాటల్లో నీకు మన క్లాస్ లో ఎవరు అంటే ఇష్టం అంది .. ఇంకెవరు నాకు నాని అంటే ఇష్టం ...అందుకే గా వాడి కోసం చిరంజీవి పోస్టర్స్ తెస్తాను వాడి లవర్ కి లెటర్స్ ఇస్తాను అని అన్న...ఓకీ బెల్ కొట్టారు క్లాస్ కి వెళ్ళిపోయాం..కట్ చేస్టేయ్

మర్నాడు నాని నేను ఇచ్చిన చిరంజీవి పోస్టర్స్ అన్ని తెచ్చి నా మొహం మీద కొట్టి నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు మంచి ఫ్రెండ్ వి అనుకున్న ఇంకెప్పుడూ నాతో మాట్లాడకు అని వెళ్ళిపోయాడు..మిగత అబ్బాయులు ఏమో ఏంటి ఇలా చేశావ్ అని సానుభూతి..నాకు ఎం జరిగిందో తెలియదు అసలు ఏంటి మ్యాటర్ అంటే ...నువ్వు వాడిని లవ్ చేస్తున్నావ్ ఆంట కదా నీకు తెలుసు కదా వాడు చినతనం నుంచి అన్నపూర్ణ ని ఇష్టపడుతున్నాడు అని అన్నారు..నేను లవ్ చెయ్యడం ఏంటి అంటే ఏమో నాగమణి చెప్పింది అని అన్నారు...చూశారా ఇష్టం కాస్త ప్రేమ అయిపోయింది...నేను అమ్మాయి తో నిజం చెప్పించి నాకు పడ్డ నింధ ని తొలిగించుకున్న అనుకోండీ..

ఆ దెబ్బకి అమ్మాయలికి చాలా దూరం...వాళ్ళు మాట్లాడితే వినడం తప్ప నేను పెద్దగా మాట్లాడాను వాళ్ల ముందు...అప్పుడప్పుడు వాళ్ళతో మొట్టికాయలు తింటూ..జాగర్త పడుతూ ఏదో అలా బతికేస్తున్న ....10 సంవత్సరాల ముందు ఏర్పర్చుకున్న నియమం...నిన్న తప్పాను...దెబ్బ తిన్నాను ఘోరం గా...

కొత్త ఆఫీస్ లో రెస్ట్ రూమ్ మేంటెనెన్స్ బాగాలేదు ...అదే మిగత గాల్స్ తో అంటే అవును అన్నారు ...ఇంతలో అడ్మీన్ అడిగాడు...హౌ డూ యూ లైక్ ద ఆఫీస్ అని సరే కదా అని చెప్ప ఆయన వెంటనే నాకు ఎందుకు చెప్పలేదువీ వుడ్ హ్యావ్ రెక్టిఫైడ్ ద థింగ్ అనిఆ అమ్మాయి ని అడిగారు నా ముందే ఆ పిల్ల లేదు సర్ ఎవరు అన్నారు అబ్బెయ్ అలా ఎం లేదు.. ఇట్స్ క్వైట్ గుడ్ అంది...

నాకు వెంటనే బ్యాక్‌గ్రౌండ్ లో సాంగ్ స్టార్ట్ అయ్యింది..... ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..

ఈ వర్షం సాక్షిగా...

| | | 0 comments



నిన్న ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం... చాలా ధైర్యంగా ఉన్న బండి లో రైన్ కోట్ ఉంది వర్షం రాదు అని కానీ కురిసింది.. అదేంటో బహుశా నేను అవును అంటే కాదు అని కాదు అంటే అవును అనే నా దేవుడు / దెయ్యం ఆ 10 నిముషాలు నిద్రపోయి ఉంటాడు...అవును 10 నిముషాలే...వర్షం వస్తుంది అని నేను రేన్ కోట్ వేసుకోగానే వర్షం స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోతే మరి అంతే కదా ... ఇంటికి చేరగనే గేట్ తీసి ఎదురు వచెయ్ అమ్మ కనిపించలేదు.. అప్పుడు గుర్తు వచింది అవును ఏదో పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పింది.. సరే ఎం చేస్తాం... మాముల్గానే అమ్మ ని చూస్తే అమ్మ ఉంది గా చేసి పెట్టడానికి అని ఒళ్ళు వంగడు... అమ్మ లేకపోటెయ్ అమ్మ లేదు గా అని వంగడు...(మొత్తానికి వంగడు :డ్)

కొంచెం కాలి గా ఉంటే పరిగెత్తుకుంటూ వాచీ నెత్తికి ఎక్కెయ్ మా ఉహా సుందరి వచేసింది..గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేస్తూ...

చిన్నప్పుడు వర్షం అంటే స్కూల్‌కీ సెలవు రోజు అని అర్దం...కొంచెం పెద్ద అయ్యాక అంటే 10త్ క్లాస్ టైమ్ లో వర్షం అంటే అమ్మ చేతి చికన్ బిర్యానీ ( అవును అమ్మ చికన్ బిర్యానీ టీ చేసినంత ఫాస్ట్ గా చేస్తుంది ) తర్వాత టైమ్ అంటే కాలేజ్ టైమ్ లో వర్షం అంటే వస్తాడు నా రాజు ఈ రోజు అని పాడుకునేయ్ టైమ్...
.
.
.
.
.
.
..

.
.
కానీ ఇప్పుడు వర్షం అంటే చీ వేదవ వర్షం ఇప్పుడెయ్ రావాలా..ఛీ ఛీ అని తిట్టుకునేయ్ టైమ్ .....

ఉహాసుంధరి

Wednesday, June 30, 2010

| | | 2 comments


అవును ఈ పేరు నాకు సరిగా సరిపోతుంది ...ఇలా జరుగుతుంది..అలా అయ్యి ఉంటుంది... ఇలా చేస్తారు ఏమో.. అలా చేస్తారు ఏమో అని అనుకున్నవి అన్ని 80% కరెక్ట్ గా అలానే అవుతాయి 20% రాంగ్ అవుతాయి... కానీ ఇలా ఉహించేసుకుని నేను పడే బాధ ఒకోసారి నేను రెండు సార్లు పడుతుంటా అన్న మాట.. సంఘటన జరగక ముందు ఒకసారి జరిగాక ఒకసారి..ఎవరన్నా నలుగురు మాట్లాడుకుంటే న గురించే నేమో..నన్ను చూసి నవ్వితే ఎందుకు నవ్వారో బాబోయి అనుకోవడం..నవ్వకపోటెయ్ ఎందుకు నావ్వలేదు..ఎం అయ్యిందో అని..

నలుగురు ఉన్న చోటికి వెళ్ళాలి ఆంటెయ్ ఇంకా ఆది నాకు ప్రపంచ యుద్దమే...వెళ్ళి నా పని నేను చేసుకుని రావడం లేదా వెళ్ళకుండా ఉండటానికి కారణాలు వెతుకోవడం... నాకు తెలిసిన వాళ్ల దగ్గరికి తప్ప కొత్త వాళ్ళతో కలవలెను...

ఇవి అన్ని చదివి తెనాలి లో కమల్‌హాసన్ ని అనుకునేరు...మరి అలా కాదు...

నాది ఖచితం గా జబ్బే..ఎవరన్నా డాక్టర్స్ ఉంటారా ఇలాంటి వాటికీ...

మా ఫ్యామిలీ ఫోటో

Saturday, June 26, 2010

| | | 3 comments
మా ఫ్యామిలీ ఫోటో
.
.
.
.
.
.
.
.
.
.



బాగుంది కడు..

నన్ను ఎం చెయ్యాలి అన్న అటు ఇద్దరు ఇటు ఇద్దరని దాటి రావాలి...

నా కుటుంబమే నా ఆస్తి.. నా సర్వస్వం

మనసాక్షి

| | | 3 comments



అప్పుడు నా వయసు 8...ఆ రోజు ఆదివారం... మా తమ్ముడిని ఎత్తుకుని మా ఇంటి నుంచి నేను ఇంటికి అంత దూరం ఎందుకు వెళ్ళాం నాకు ఇప్పటికీ అర్దం కాదు..అప్పటికీ మధ్యానం అయ్యింది...తమ్ముడు ఏడుస్తున్నాడు...వాడి ఏడుపు చూసి నేను ఏడుస్తున్న...ఎవరో ఇంటి ముందు ...ఎవరో ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు ఆంటెయ్ ..మా అమ్మ లేదు ఆకలి కి ఏడుస్తున్నాం అంటే ఆవిడ నాకు ఏదో పెట్టింది తినమని ఆది నాకు ఇస్టం లేదు అని చెప్ప....అప్పుడు ఆవిడ నాకు కోడిగుడ్డు తమ్ముడికి పాలు ఇచింది...అవి తినేసి..ఎలా ఇంటికి వెళ్లనో గుర్తు లేదు వెళ్ళిపోయ..

వేదించే ప్రశ్నలు ఎన్నోఅలా ఎందుకు వెళ్ళాను??
ఎందుకు ఏద్చను?
అప్పుడు ఇంట్లో ఎవరు లేరా?
అమ్మ ఏమీ చేస్తుంది?
ఆకలి వేస్తే అమ్మ ని అడిగాలి కదా?
ఎందుకు అడగలేక పోయాను?
అవి అన్ని గుర్తు లేవు ముందు వెనకలు గుర్తు లేవు
ఈ ఇన్సిడెంట్ మాత్రం పీడకల ల వెంటాడుతూనే ఉంటుంది
చినపుడు ఒక్కోసారి ఎంతో తెలియకుండా చేసేస్తుంటాం అని సరిపెట్టుకోలేను

కోడిగుడ్డు చూస్తే ఆ రోజు నేను చెప్పిన అబద్దం గుర్తు వస్తుంది...ఆ సంఘటన తల్చుకునప్పుడల్లా అలా ఎందుకు చేసానో అని నాకు తెలియకుండానే ఏడ్చేస్తాను... నేను చాలా సిగ్గు పడుతున్న .... బహుశా అప్పుడు అలా చేసిన పని అమ్మకి చెప్పి ఉంటెయ్ అమ్మ దండనతో నాలో బాధ పోయేది ఏమో... అమ్మకి చెప్పాలి అంటే భయం..బహుశా ఎప్పటికీ చెప్పలేను ఏమో...ఈ బాధ నా జీవితాంతం నన్ను వెంటాడుతుంది

అమ్మ నేను మంచి పిల్లని కాదు... ఈ విషయం నీ దగ్గర దాచాను...నన్ను క్షమించవు...

.....

Friday, June 25, 2010

| | | 0 comments

మార్పు! ప్రతి మనిషి సామాజికంగా జీవనపరంగా కావాలి అని కోరుకునేది
అబివృద్ది! అన్ని విషయాలలో కావాలి అని చూసేది..

కానీ ఎంత వరకు విజయం సాధిస్తున్నాం ....

మనసు ఎం బాగాలేదు... ఏ చ్యానెల్ చూసిన గొడవలు, మానబంగాలు, అక్రమ సమ్బదలుహత్యలు దోపిదులు, రోడ్ ప్రమాదాలు, పబ్ లో విశృంకలతలు..ఎందుకు ఇలా ఉంది నా దేశం...ఎప్పుడు ఇంతే నా నేను ఇప్పుడెయ్ గమ్‌నిస్తున్నానా?

అడాధే ఆధారం అంటారు నిజమే
ఎదుటి మనిషిని తిట్టాలి అన్న అడాధే ఆధారం
మనిషి పుట్టలి అన్నఅడాధే ఆధారం
శత్రువుని ఎదురుకోవాలి అన్న అడాధే ఆధారం
గొడవ పెట్టుకోవాలి అన్న అడాధే ఆధారం
జీవితం లో ఎదగాలి అన్న అడాధే ఆధారం
సర్వానాశనం అవ్వాలి అన్న అడాధే ఆధారం

అన్నిటికి ఆధారం అయిన అడధానికి ఆమె మనోనిబ్బరం వరమ లేక శపమా

దానిమ్మ

Sunday, June 20, 2010

| | | 2 comments


నేను అప్పుడు ౫ తరగతి చదువుతున్న….పరీక్షలు అయిపోయాయి……వేసవి సెలవలు…..హౌస్ ఓనర్ ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు ఉండేది…..అప్పుడెయ్ దానికి మొదటి సారి 3 పిన్దలు వచాయి…..రోజు గార్డెనింగ్ చేసేదాన్ని ఆంటీ తో కలిసి…ఒక రోజు ఆ కాయ మీడియమ్ సైజ్ కి వచ్చాక పండింది అని కోసెశా…కానీ మళ్లీ ఆంటీ కి చెప్పకుండా కోసా అని తిదుతుంది అని చెప్పి మన అతి తెలివితో దానికి దారం చూట్టి కొమ్మకి కట్టాను…..ఇంకా ఆది పడదు అని ధీమా గా వెళ్ళిపోయ….కానీ మన టైమ్ ఆది గాలికి పడిపోయింది సాయంత్రం ఆంటీ చూసేసింది…..ఎవరు కోసారో తెలియదు….పోనీ గాలికి పడింది అనుకోదానికి లేకుండా దానికి దారం……ఇంకా ఆవీడికి వచిన తిట్లు అన్ని స్టార్ట్ చేసింధీ…..మనకి భయం స్టార్ట్ అయ్యింది అమ్మకి తెలిస్టెయ్ ఉతికి అరెస్తుంది అని మంచం కింద కి దూరేస(అక్కడ అమ్మ పట్టాడు కదా రాలేదు)……ఎవరికి తెలియదు అమ్మ వాళ్ళు వేతుకుతున్నారు…..ఆ రోజు గురువారం ఫ్రైడే కి ఇల్లు కడిగెవాళ్ళు అప్పట్లో…….అమ్మ మంచం కిందకి నీళ్ళు పోస్తెయ్ నేను కుక్క పిల్లలా ములుగుతున్న…..అమ్మ వంగుని చూసి అక్కడ ప్రశాంతం గా పడుకున్న నన్ను చూసి ఆవిడ పడ్డ టెన్షన్ అంతా గుర్తు వచ్చి మంచం పక్కకి జరిపేసి నన్ను తన్నటానీకీ చెయ్య ఎత్తి ఒక్క సిక్స్ ఇచింది…..మళ్లీ కొట్టేలోపు నేను పడిపోయ…ఫుల్ ఫీవర్……వన్ వీక్ తగ్గలేదు…అప్పట్నుండి దానిమ్మకాయి చూస్తే…..ఆవిడ తిట్లు నా జ్వరం గుర్తు వస్తాయి….

(తప్పులు చాలా వస్తున్నాయి కొన్ని రోజులు భరించండి)

ప్రస్తుతం ఇలా ఉంది.

| | | 0 comments


కొత్త ఉద్యోగం లో చేరాను అందుకే రాయలేకపోయాను...కొత్త చోటు బాగుంది..మనుషులు బాగున్నారు...ముందు ముందు ఎలా ఉంటుందో మరి ..
మూడు రోజులుగా చక్కగా వర్షం లో తడుస్తూ ఇంటికి వెళ్తున్న... నా స్నేహితుడి పెళ్లి కి వెళ్ళడం కుదరడం లేదు... మా చెల్లి ని వాళ్ల ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యడం కుదరడం లేదు వాళ్ల ఆయన లేనప్పుడు .... బాగుంది జీవితం..ప్రస్తుతం ఇలా ఉంది...

వర్షం రోజు పడాలి ...

మానశసంచరరే

Monday, June 14, 2010

| | | 2 comments



నేను ఆన్‌లైన్ లో చదివిన మొదటి బుక్ ఇంకా బాగా ఇంప్రెస్ అయిన బుక్ ...ఈ నోవెల్ రాసిన రైటర్ ఒక మెడికో...చాలా బాగా రాశారు...తనకి ఎంసెట్ లో ర్యాంక్ రావడం తన చిన్నతనం..కాలేజ్ లైఫ్..హాస్టిల్ లైఫ్...తన ప్రేమ గురించి ఆమె చనిపోయినప్పటి బాధ గురించి...బెస్ట్ ఫ్రెండ్ గురించి...అసలు చదవడం స్టార్ట్ చేస్తే అప లేం అంత బాగుంధీ...మీకు ఎవరికైన ఈ బుక్ హార్డ్‌కాపీ గురించి తెలిస్తే చెప్పండి...నాకు కావాలి

by the way here is Manasasanchararey...


తాను రాసిన మరో నోవెల్ శ్రీ కూడా చాలా బాగుంటుంది..

పాము పగ పట్టింది(పడుతుంది)

Saturday, June 12, 2010

| | | 9 comments




మా అమ్మ వాళ్ల మేనమామ గారు లక్ష్మినగార్ లో ఉంటారు..వాళ్ళకి తోటలు పొలాలు పాడి బాగా ఉన్నాయి..మా ఉహా తెలిసిన దగ్గరనుంచీ రాంబాబు అనే పాలేరు అబ్బాయి ఉండేవాడు..తనకి ఎవరు లేరు అందుకని మా తాతగారి ఇంట్లోనే ఉండేవాడు..రోజు గెదలని అవుని పొలం తీసుకు వెళ్ళడం వీడి పని ఇంటికి వచ్చాక గొడ్లసావిట్లో కట్టి అక్కడే తిని పడుకునేవాడు ..మాకు పొలం నుంచి తాటికాయలు, తాటి ఆకుల మంట మీద కాల్చిన బొబ్బర్ర్లు లాంటివి అన్ని తెచేవాడు..

ఒకరోజు పొలం వెళ్తున్నాడు అక్కడ వాడికి అక్కడే పుట్టలోకి వెళ్ళిపోతున్న పాము కనిపిస్తే దానిని పుట్టలోకి వెళ్లనివ్వకుండా దాని తోక పుచ్చుకుని బలం గా లాగాలని చూసాడు ఎంత బలం గా అంటే వాడి చేతికి దాని తోక సగం తెగి చేతికి వచ్చేసింది అంట వెంటనే వీడు కలుగులో కర్రతో నాలుగు సార్లు పొడిచాడు అంట దాని తల భాగం కూడా చచ్చిపోవాలి అని, కర్రకి అంటుకున్న బ్లడ్ చూసి ఇంకా చచ్చింది అని పొలం వెళ్ళి వాడి పని చూసుకుని ఇంటికి తిరిగి వాచాడు..ఇంటికి రాగానే గెదలని కట్టి దాన వేసి పాలు తీసి వాడి పనులు అన్ని పూర్తిచేసాడు.

మా మామ్మ అన్నం కి పళ్లెం తెచుకో అని పిలిస్తే పళ్లెం తెచుకోడానికి గొడ్లసావిట్లో కి వెళ్లాడు..ఎప్పుడు వాడు గొడ్లసావిట్లో ఉన్న గూట్లో తన పళ్లెం గ్లాస్ ఉంచుకునేవాడు..ఆది తెచుకోడానికి వెళ్లాడు కాసేపాటికీ మాకు గట్టిగా వాడి అరుపు వినిపించింధీ వెళ్ళి చూస్తే అక్కడ నడుం వరకు ఉన్న పాము వాడి చేతిని గట్టిగా కాటు వేసి అలానే ఉంది రాంబాబు నోట్లో నుంచి నురగలు వస్తున్నాయ్ చచిపోయాడుపాపం …

అప్పట్నుంచి నాకు పాము చూస్తే టెరర్..ఆ ఇన్సిడెంట్ మైండ్ లో బాగా గుర్తు మా అందరికి …

నాకు పాము అంటే చాలా భయం…అందుకే ఈ పోస్ట్ కి పిక్చర్ కూడా పాము పెట్ట లేదు..

కమ్యాండర్ కీన్

Friday, June 11, 2010

| | | 4 comments


నేను మొదటిసారిగాకంప్యూటర్ ని చూసింది నేను 6త్ క్లాస్ ఆంటెయ్ 1992 లో..అప్పుడు మా సర్ చెప్పే డాస్ కమ్యాండ్స్ అవి అర్దం కాక వెర్రి మొఖాలు వేసుకుని దాని వైపు బుచిని చూసినట్లు చూసేవాళ్ళం అప్పుడు వదిలేసిన సిస్టమ్ ని తర్వాత 2001 లో చూశా అప్పుడు నాకు కంప్యూటర్ ఆంటెయ్ గేమ్స్ ఆడుకోడానికి ఆల్టర్‌నేట్ అంతే...తర్వాత నెమ్మదిగా ఎమెస్ ఆఫీస్ అండ్ ఇంటెర్నెట్ అవి నేర్పించారు మా మాస్టరు(ఇప్పుడు నాకు మరిధి గారు లెండి) ఈ రోజు నేను ఇలా జాబ్ చేసుకుంటూ ఇండివిజువల్ గా హ్యాపీ గా ఉన్న అంటే కారణం ఆ రోజు ఆయన నేర్పిన విద్య నే(ఆంటెయ్ గేమ్స్ ఆడుకోవటం కాదు)...సరే విషయానికి వస్తే.అప్పుడు ఆడే గేమ్స్ డేంజరస్ డేవ్, కమ్యాండర్ కీన్, సూపర్ మారియో...ఎంత అడేదాన్ని అంటే ఆఖరికి నాకు కలలో కూడా అవేయ్ వచెవి...తర్వాత తర్వాత జీవితం తో పరుగులు పెడుతూ వాటికీ టైమ్ లేకుండా పోయింది ...నేను ఎక్కువగా నా ఫ్రీ టైమ్ గేమ్స్ మీద నే గడుపుతా..అలా ఈ మధ్య ఎక్కువ ఆడుతున్నాదిhidden object gamesమళ్లీ ఈ మధ్య కమ్యాండర్ కీన్ కోసం ఆన్‌లైన్ సర్చ్ చేస్తే కొన్ని లింక్స్ దొరికాయి...ఇక్కడ ఇస్తున్న అవి ...టైమ్ ఉంటెయ్ మీరు అడండి లేకపోతే మీ ఇంట్లో పిల్లలకి ఇవ్వండి....మీరు ఎం అలా చూడాకర్లేదు ...నాకు నిజంగానే పని లేదు....


Super Mario online
Commader Keen online
Dos Games for Download
Dangerous Dave download

మీరు ఎం అలా చూడాకర్లేదు ...నాకు నిజంగానే పని లేదు....

నా సహచరులు(సరియైన పదం ఎన?)

Thursday, June 10, 2010

| | | 0 comments



చిన్నప్పట్నుంచి నా వాళ్ళు ఆంటెయ్ మై పేరెంట్స్ సిస్టర్ బ్రో అండ్ తర్వాత పెళ్లి అయ్యాక సిస్టర్ ఫ్యామిలీ అండ్ నా ఫ్యామిలీ ని తప్ప మిగతవళ్ళతో నేను అంత ఫ్రీ గా మింగల్ కాలేను అండ్ త్వరగా ఏది షేర్ చేసుకోలేను…అలా ఫ్రిజిడ్ గా ఉండటం అలవాటు అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా కూడా బట్ లాస్ట్ వన్ యియర్ గా నన్ను నేను మార్చుకుంటూ వస్తున్న స్టార్టెడ్ మింగ్‌లింగ్ విత్ పీపల్ చాలా పరిచయాలు…చాలా అనుభవాలు…ప్రపంచం నేను అనుకున్నంత చిన్నది కాదు మంచిది కాదు…ఎన్నో పాఠాలూ నేర్చుకున్న నేర్చుకుంటున్న…ఈ మార్పులో బాగం గానే నేను ఇందివిడుాల్ గా ఉండటం స్టార్ట్ చేశాక తీసుకున్న సింగల్ బెడ్ రూమ్ ఇంకో అమ్మాయి తో షేర్ చేసుకోవాలి అనే అంత గా మారాను..సరే ఆ ప్రోసెస్ లో బాగం గా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నదీ ఆలోచించి ఆబ్వియస్ గా తెలుగు వాళ్ళకి ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యా ఎందుకు ఆంటెయ్ నా షార్ట్ టెంపర్ లో నేను అమ్మాయిని ఏమన్నా అనాలి అన్న ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్ తో కొంచెం సేపు అన్న ఆలోచిస్తాను కదా అండ్ అమ్మ వాళ్ళు వచినప్పుడు మాకు జరిగేయ్ కాన్వర్సేషన్స్ లో వాళ్ల ఇంటర్ఫియరెన్స్ లు ఉండవు…అండ్ నార్త్ ఇండియన్స్ చాలా సరదాగా పెద్ద వాళ్ళు ఆంటెయ్ రెస్పెక్ట్ తో ఉంటారు అన్న ఫీలింగ్…సో అలా డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్ కి చెప్పడం వాళ్ల ద్వారా ఒక పంజాబీ అమ్మాయి నా రూమేట్ అయ్యింది…లక్ ఏంటి ఆంటెయ్ ఆ అమ్మాయికి నేను బాగా నచ్చాను అండ్ నాకు కూడా తను రిసర్వ్డ్ గా ఉండటం, నవ్వుతూ పలకిరించడమే దీది అనిపిలిచింది .... ఇంప్రెస్ అయిపోయ ఈ టైమ్ లో తన ఫ్రెండ్ కూడా తనతో ఉండటానికి ఒప్పుకోమని అడిగింది…అమ్మో ఇద్దరా అని ఆలోచించ కానీ మళ్లీ పాపం ఆ పిల్ల కూడా ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు అని సరే అన్నాను సో ఇప్పుడు నా ఇంట్లో ఇద్దరు భలేభలే లు ఉన్నారు అన్న మాట...పెద్దగా ఇబ్బంది లేదు బాగానే కలిసిపోయారు...నేను ఎక్కువ కల్పించుకొను కాబట్టి ప్రత్స్టుతం కి కధ బాగానే నడుస్తుంది ...

ఇంతకీ వాళ్ల పేరులు చెప్పలేదు కాదు ప్రీతి అండ్ కణిక…

బేగం బజార్

| | | 4 comments


గత రెండు రోజులుగా మేడమ్ చాలా హడావిడిగా ఉన్నారు...చెల్లి వాళ్ల అత్తగారి షాష్టిపూర్తి ( స్పెల్లింగ్ మిస్టేక్) ఇంకా కిరణ్ పెళ్లి ... పెళ్లి శుభలేకల్ కోసం ఇంకా చెల్లి ఫంక్షన్ ఫేవర్స్ కోసం బేగం బజార్ చక్కబేడుతున్న అన్న మాట.....ఇందులో నేను కస్టపడిపోయింది ఎం లేదు ..నా బండి మీద వాళ్ళని అక్కడికి తీసుకు వెళ్ళడం ...వాళ్ళు చూపించినవి కాకుండా వాళ్ల కళ్ళలో మెరుపులని బట్టి ఆ గిఫ్ట్ / శుభలేక వాళ్ళకి ఎంత నచ్చిందో గెస్ చేసి చెప్పడం అన్న మాట... చాలా ఈసీ పని కదా..ఇంత పెద్ద సహాయం వాళ్ళకి చేసినందుకు నాకు వాళ్ళు అదేదో రాజ్ కాచోరీ ఆంట తినమని ఇచ్చారు తినేసా బాగానే ఉంది... ఈ సారి బేగం బజార్ ఆంటెయ్ రాజ్ కాచోరీ ఇప్పిస్తే వస్తా అనీ చెప్పాలి ....

నిన్న లేని అందమేదో ....లా లా లా

Tuesday, June 8, 2010

| | | 1 comments

నేను హైదరాబాద్ లో ౨౦౦౪ నుంచి ఉంటున్న కానీ హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుంది అని తెలియదు నిన్నటివరకు...

ఏంటి అబ్బ అంత గొప్ప విషయం అనుకుంటున్నారా నిన్న నేను ఫస్ట్ టైం ట్యాంక్ బండ కి వెళ్ళాను...అది ఎం గొప్ప సంగతి అని తిసిపదేయకండి ఇది వరకు పని మీద అటు వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్ గోల కి నేను అలానే అనుకునేదాన్ని...అబ్బ ఇది ఎం రోడ్ ర బాబు అని ...కానీ నిన్న ఫస్ట్ టైం అక్కడ బండి పార్క్ చేసి ఆ ట్యాంక్ బండ్ అందాలూ చూసాను...అడుక్కునే వాళ్ళు, చిరుతిల్లి అమ్మేవాళ్ళు , చిన్నపిల్లలు , కాలేజీ స్టూడెంట్స్, లవర్స్ ఫామిలీస్...అబ్బ చాల మంది ఉన్నారు అక్కడ... వాళ్ళని చూసి ఇదివరకు విళ్ళకి ఇది ఎం పిచ్చి రా బాబు ...ఆ కంపు లో అలా తిరుగుతారు అనుకున్న కానీ అది తప్పు అని నిన్న అర్ధం అయ్యింది ఆ చల్ల గాలి అమ్మ ఒడిలో సేద తిరినట్లుగా ఉంటుంది..ఆ ట్రాఫిక్ గోల మనకి అసలు వినపడ్నే పడదు..ఆ బుద్దిడి అందాలూ ప్రంపంచాన్ని మర్చిపోయేలా చేస్తాయి నిజంగా చిన్ని గారిలా నేను కూడా దాన్ని న కేర్ ఆఫ్ అడ్రస్ లా చేసుకోవాలి అనిపించింది..దగ్గర ఏరియా లో ఇల్లు దొరుకుతుంది ఏమో చూసి అమ్మ ఒప్పుకుంటే ఇల్లు మారిపోవలి...

పంది పురాణం :P

| | | 1 comments


నేను ఫస్ట్ క్లాసు నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్ లో చదివాను...కానీ సిక్ష్స్థ్ సెలవుల లో అంతే సెవెంత్ క్లాసు లోకి వచ్హాక మా
నాన్నగారు వ్యాపార నిమిత్తం వైజాగ్ మారుదాం అనుకున్నారు...సో అక్కడ ఒక స్కూల్ లో జాయిన్ చేసారు(ఆ స్కూల్ లో ౩ నెలలే ఉన్న)..కొత్త ప్లేస్ నో ఫ్రెండ్స్...అప్పుడు మా యోగ టీచర్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది పొద్దున్న లేచి ద్యానం చేసి మనకు కావాల్సింది అనుకున్తేయ్ అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది అని ...సో పొద్దున్న లేచి దేవుడా నాకు మంచి ఫ్రెండ్ ని ఇవ్వు అని పది నిముషాలు కళ్ళు మూసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుని కళ్ళు తెరిస్తేయ్ ఏముంది ఎదురుగ పంది ఉంది ....దెబ్బకి ఇంట్లోకి పారిపోయ...కుదురుగా ఉండకుండా వెళ్లి మా సర్ తో గొడవ మల్లి మీరు అబద్దం చెప్పారు అని...అయన ఎం అయ్యింది అంటి జరిగిందీ చెప్పా...నీకు అదీ కరెక్ట్ ఏమో అందుకీ దేవుడు దాన్ని చూపించాడు అని కుళ్ళు జోకులు మల్లి ....మా సర్ మాతో ద్యానం చేయించడానికి అలా చెప్పారు అని తర్వాత అర్ధం అయ్యింది ...--

అప్పుడు కుళ్ళుకున్న పంది ని చూడగానే ఈ సంఘటనా గుర్తు వస్తుంది...

నాకు కొంచెం తొందర ఎక్కువ

| | | 1 comments
నాకు కొంచెం తొందర ఎక్కువ ... అవును ఎందుకో తెలుసుకోవాలి అంటే ఈ పోస్ట్ చదవండి మీరు ఒప్పుకుంటారు

మొన్న నా ఫ్రెండ్కి ఫోన్ చేసా చాలా రోజుల తర్వాత... పెళ్లి ఎప్పుడు అని అడిగా మాటల్లో ఇప్పుడు కాదు అక్టోబర్ తర్వాతనే అని అన్నాడు అంటే ఎవరో పెద్ద వాళ్ళు చని పోయి ఉంటారు అనుకుని ఎవర్ని చంపేశావ్ ఏంటి అని అన్న. ఓ నీకు తెలియదు కదా మా నాన్నగారు చనిపోయారు అని అన్నాడు ఓ సారీ నాకు తెలియదు అని సారీ చెప్పి ఎం మాట్లాడాలో అర్దం కాక ఫోన్ పెట్టేసా ఇది ఒక ఉదాహరణ

నిన్న మా సిస్టర్ వాళ్ల అత్తగారికి గోల్డ్ కొన్ది బాగాలేదు అని అనేశాను వెంటనే. వాళ్ల ఆయన బాగాలేదు ఆంట చేంజ్ చేద్దాం ఇవ్వాళ అని అన్నారు ఆంట. పొద్దున ఫోన్ చేసి క్లాస్ పీకింది .... (మనలో మన మాట నిజంగా బాగాలేదు )

ఈ విధంగా నేను రోజు ఒకటి అన్న చేస్తాను ... నాతో మాట్లాడేటపుడు పెద్దగా ఫీల్ అవ్వాక్కండి