మనసున మనసై

Thursday, December 20, 2012

| | |

గత నెల రోజులుగా మా కాలనీ లో ప్రతి ఆదివారం బోర్ మేలా నడుస్తుంది... మా వీధిలో 3 కొత్త ఇల్లు నిర్మాణం మొదలు పెట్టారు...వీధి కి ఆ పక్క నిర్మాణం ఈ పక్క కొత్త గుడిసలు ..సిమెంట్ ఇసుక, ఇటుకలకి కాపలా ఇంకా పని వాళ్ళకి టీ పెట్టడానికి మనుషులు ఉండటానికి... అలా ఒక గుడిసెలో దుర్గ వాళ్ళ అయన వచ్చారు.. దుర్గ కి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి... మా ఇంటికి ఎదురుగానే అన్నమాట ..పొద్దునే లేచి కాలనీ లో ఇద్దరి ఇళ్ళలో పనికి వెళ్తుంది .. వాళ్ళ అయన ఇక్కడ నిర్మాణం కి కాపలా గా  ఉంటాడు..ఏదన్న పని ఉంటె చెప్పు అమ్మ అని అడిగింది సో నేను కొంచెం ఇంటి చుట్టూ వారంకి ఒకసారి కడగమని చెప్పా..అలా  మొన్న వారం  మాటలు కలిపింది...తన గురించి చెప్పింది...


వాళ్ళది తణుకు...వ్యవసాయ పనులు చేసుకుంటూ కూతురు ని కొడుకు ని పెంచి పెద్ద చేసారు...అమ్మాయికి పెళ్లి అయ్యింది...కొడుకుకి కూడా పెళ్లి అయ్యింది ఆతను వ్యవసాయ పనులే చేసుకుంటాడు...కోడలికి టెలిఫోన్ ఎక్స్చేంజి లో ఉద్యోగం అంట ... వయసు అయిపొయింది...కొడుకుకి ఈ పెద్దవాళ్ళు భారం అయ్యారు..ఊరిలో  మట్టి పని చేసుకుని వచ్చే డబ్బులు ఒక పుటకి వస్తాయి అంట అందుకని నాలుగు డబ్బు సంపాదిన్చుకుందాం  అని ఇక్కడికి వచ్చారు...

నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటి అంటె ఆవిడ  2 ఇళ్ళలో పని చేసి ఇంటికి వచ్చి పడుకుంటది అప్పుడు వాళ్ళ అయన వంట చేసి పెడతాడు... ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారు...అందుకే అంటారు ఏమో పెద్దవాళ్ళు మనసున మనసై బతుకున బతుకై తోడు ఒకరుండిన అదే భాగ్యము ...అదే భాగ్యము 


2 comments:

Chinni said...

అర్థం చేసుకుని సహకరించే జీవిత భాగస్వామి దొరకడం ఎంతైనా అదృష్టం శిరీష గారు..

Padmarpita said...

బాగుందండి....ఇలా ఒకరిఒకరు తోడుగా ఉన్నారని చదువుతుంటేనే హాయిగా అనిపించింది.