
అవును ఈ పేరు నాకు సరిగా సరిపోతుంది ...ఇలా జరుగుతుంది..అలా అయ్యి ఉంటుంది... ఇలా చేస్తారు ఏమో.. అలా చేస్తారు ఏమో అని అనుకున్నవి అన్ని 80% కరెక్ట్ గా అలానే అవుతాయి 20% రాంగ్ అవుతాయి... కానీ ఇలా ఉహించేసుకుని నేను పడే బాధ ఒకోసారి నేను రెండు సార్లు పడుతుంటా అన్న మాట.. సంఘటన జరగక ముందు ఒకసారి జరిగాక ఒకసారి..ఎవరన్నా నలుగురు మాట్లాడుకుంటే న గురించే నేమో..నన్ను చూసి నవ్వితే ఎందుకు నవ్వారో బాబోయి అనుకోవడం..నవ్వకపోటెయ్ ఎందుకు నావ్వలేదు..ఎం అయ్యిందో అని..
నలుగురు ఉన్న చోటికి వెళ్ళాలి ఆంటెయ్ ఇంకా ఆది నాకు ప్రపంచ యుద్దమే...వెళ్ళి నా పని నేను చేసుకుని రావడం లేదా వెళ్ళకుండా ఉండటానికి కారణాలు వెతుకోవడం... నాకు తెలిసిన వాళ్ల దగ్గరికి తప్ప కొత్త వాళ్ళతో కలవలెను...
ఇవి అన్ని చదివి తెనాలి లో కమల్‌హాసన్ ని అనుకునేరు...మరి అలా కాదు...
నాది ఖచితం గా జబ్బే..ఎవరన్నా డాక్టర్స్ ఉంటారా ఇలాంటి వాటికీ...