ఈ వర్షం సాక్షిగా...

Thursday, July 1, 2010

| | |



నిన్న ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం... చాలా ధైర్యంగా ఉన్న బండి లో రైన్ కోట్ ఉంది వర్షం రాదు అని కానీ కురిసింది.. అదేంటో బహుశా నేను అవును అంటే కాదు అని కాదు అంటే అవును అనే నా దేవుడు / దెయ్యం ఆ 10 నిముషాలు నిద్రపోయి ఉంటాడు...అవును 10 నిముషాలే...వర్షం వస్తుంది అని నేను రేన్ కోట్ వేసుకోగానే వర్షం స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోతే మరి అంతే కదా ... ఇంటికి చేరగనే గేట్ తీసి ఎదురు వచెయ్ అమ్మ కనిపించలేదు.. అప్పుడు గుర్తు వచింది అవును ఏదో పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పింది.. సరే ఎం చేస్తాం... మాముల్గానే అమ్మ ని చూస్తే అమ్మ ఉంది గా చేసి పెట్టడానికి అని ఒళ్ళు వంగడు... అమ్మ లేకపోటెయ్ అమ్మ లేదు గా అని వంగడు...(మొత్తానికి వంగడు :డ్)

కొంచెం కాలి గా ఉంటే పరిగెత్తుకుంటూ వాచీ నెత్తికి ఎక్కెయ్ మా ఉహా సుందరి వచేసింది..గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేస్తూ...

చిన్నప్పుడు వర్షం అంటే స్కూల్‌కీ సెలవు రోజు అని అర్దం...కొంచెం పెద్ద అయ్యాక అంటే 10త్ క్లాస్ టైమ్ లో వర్షం అంటే అమ్మ చేతి చికన్ బిర్యానీ ( అవును అమ్మ చికన్ బిర్యానీ టీ చేసినంత ఫాస్ట్ గా చేస్తుంది ) తర్వాత టైమ్ అంటే కాలేజ్ టైమ్ లో వర్షం అంటే వస్తాడు నా రాజు ఈ రోజు అని పాడుకునేయ్ టైమ్...
.
.
.
.
.
.
..

.
.
కానీ ఇప్పుడు వర్షం అంటే చీ వేదవ వర్షం ఇప్పుడెయ్ రావాలా..ఛీ ఛీ అని తిట్టుకునేయ్ టైమ్ .....

0 comments: