మా అమ్మ వాళ్ల మేనమామ గారు లక్ష్మినగార్ లో ఉంటారు..వాళ్ళకి తోటలు పొలాలు పాడి బాగా ఉన్నాయి..మా ఉహా తెలిసిన దగ్గరనుంచీ రాంబాబు అనే పాలేరు అబ్బాయి ఉండేవాడు..తనకి ఎవరు లేరు అందుకని మా తాతగారి ఇంట్లోనే ఉండేవాడు..రోజు గెదలని అవుని పొలం తీసుకు వెళ్ళడం వీడి పని ఇంటికి వచ్చాక గొడ్లసావిట్లో కట్టి అక్కడే తిని పడుకునేవాడు ..మాకు పొలం నుంచి తాటికాయలు, తాటి ఆకుల మంట మీద కాల్చిన బొబ్బర్ర్లు లాంటివి అన్ని తెచేవాడు..
ఒకరోజు పొలం వెళ్తున్నాడు అక్కడ వాడికి అక్కడే పుట్టలోకి వెళ్ళిపోతున్న పాము కనిపిస్తే దానిని పుట్టలోకి వెళ్లనివ్వకుండా దాని తోక పుచ్చుకుని బలం గా లాగాలని చూసాడు ఎంత బలం గా అంటే వాడి చేతికి దాని తోక సగం తెగి చేతికి వచ్చేసింది అంట వెంటనే వీడు కలుగులో కర్రతో నాలుగు సార్లు పొడిచాడు అంట దాని తల భాగం కూడా చచ్చిపోవాలి అని, కర్రకి అంటుకున్న బ్లడ్ చూసి ఇంకా చచ్చింది అని పొలం వెళ్ళి వాడి పని చూసుకుని ఇంటికి తిరిగి వాచాడు..ఇంటికి రాగానే గెదలని కట్టి దాన వేసి పాలు తీసి వాడి పనులు అన్ని పూర్తిచేసాడు.
మా మామ్మ అన్నం కి పళ్లెం తెచుకో అని పిలిస్తే పళ్లెం తెచుకోడానికి గొడ్లసావిట్లో కి వెళ్లాడు..ఎప్పుడు వాడు గొడ్లసావిట్లో ఉన్న గూట్లో తన పళ్లెం గ్లాస్ ఉంచుకునేవాడు..ఆది తెచుకోడానికి వెళ్లాడు కాసేపాటికీ మాకు గట్టిగా వాడి అరుపు వినిపించింధీ వెళ్ళి చూస్తే అక్కడ నడుం వరకు ఉన్న పాము వాడి చేతిని గట్టిగా కాటు వేసి అలానే ఉంది రాంబాబు నోట్లో నుంచి నురగలు వస్తున్నాయ్ చచిపోయాడుపాపం …
అప్పట్నుంచి నాకు పాము చూస్తే టెరర్..ఆ ఇన్సిడెంట్ మైండ్ లో బాగా గుర్తు మా అందరికి …
నాకు పాము అంటే చాలా భయం…అందుకే ఈ పోస్ట్ కి పిక్చర్ కూడా పాము పెట్ట లేదు..
9 comments:
ammo...nijama?? naku kooda bhayam start ayyindi ee post choosaka...hmmm
hmmm really scary incident...
సగం పాము.....కుట్టింది...............?????
మీరు నిజంగా చూసారా? ఎవరన్నా చెప్పారా?.
నమ్మశక్యంగా లేదు.
ఒక వేళ మీరు నిజంగా చూసినట్లైతే......,
నమ్మక తప్పుతుందా.
పొద్దునే అనుకున్నా... పాములు నిజంగానే దైవత్వం /దుష్టత్వం కలిగి ఉంటాయా? అని. ఇదిగో సమాధానం దొరికింది.
శిరీష గారు, బాగుందండి మీపాము పగ..! ఒక విషయం..మీరు మీ బ్లాగ్ కి ఎంచుకున్న టెంప్లేట్ ..నేను కూడ 2009 నవంబర్ లో ఇదే టెంప్లేట్ ని ఎంచుకొని..ప్రస్తుతం నా బ్లాగ్ కి వాడుతున్నా...! ఇప్పుడూ మీ బ్లాగ్ చూసాక ఇదేంటి నా బ్లాగ్ లాగుందే అని ఆశ్చర్యపడ్డా..! ఒకసారి నాబ్లాగ్ ని కూడ చూడండి..! అలాగే మీరు మీ బ్లాగ్ టెంప్లేట్ లో HTML ఎడిట్ చేసినట్లున్నారు..అదేలాగో నాకు చెప్పగలరా..?
నమ్మలేని నిజాలు లాగ ఉన్నది పాము పగపట్టడడం..! శిరీషగారు..మరో విషయం మీరు నేను ఒకే బ్లాగ్ టెంప్లేట్ వాడుతున్నాము బహుశ యాదృచ్చకమే అయ్యుండొచ్చు..! మీ బ్లాగ్ కి రాగానె మొదట కన్ఫ్యూజ్ అయ్యా నాబ్లాగా అని...!..ఒక సారి నా బ్లాగ్ కూడ చూడండి..!
@ తిక్క .. సారీ మీ పేరు తెలియదు...కొన్ని నమ్మక తప్పదు
@ స్వర్ణ మల్లిక: కొన్ని సార్లు నాకు కూడా అంతే అండీ
@ కమల్ : మీ బ్లాగ్ బాగుంది...
అయ్య బాబోయ్ అసలే పాములంటే చచ్చేంత భయం . రోజూ రాకోయీ అనుకోని అతిధి అని పాడుకొని పడుకుంటాను ( ఈ మద్య మా ఇంటి దగ్గర వారింట్లోకి పామొచ్చిందిలెండి .) ఇహ ఈ రోజు అస్సలు నిద్ర పట్టదు !
Sorry Sirisha...adi naa mistake..ee postki comment raayaboyi prev postki raasesaa...naa comment mee prev post lo kanipisthundi
Post a Comment