నాన్న

Monday, July 5, 2010

| | |



నేను చెల్లి పుట్టగానే లక్ష్మి దేవి పుట్టింది అని మురిసిపోయారు అంట నాన్న మీరు..
ఒక అబ్బాయి ఉండాలి అని తమ్ముడు కోసం ఆగారు అంట..మేము పిల్లలాగా ఆగారు ఈ రోజు వరకు మా సంరక్షణ మా అలన పాలనా అమ్మతో సమానంగా కాదు అమ్మకన్నా ఎక్కువుగా మీరే చూస్తున్నారు...
మాకు స్నానం చేయించడం ఈ ఉరు వెళ్ళిన మా కోసం ఏవో ఒకటి తీసుకు రావడం...తమ్ముడు రాత్రి పూట మీరు వచ్చేవరకు నిద్రపోయేవాడు కాదు వాడిని ఒక రౌండ్ బుల్లెట్ మీద తిప్పితేయ్ కానీ ఎంత అలసి పోయిన మీరు మమల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు...చెల్లి చాలా కలుపుగోలుగా అందరితో ఉండేది...నేను ఎలా బతుకుతానో మీరు ఎప్పుడు అనేవారు ఇప్పటికి అంటున్నారు అనుకోండి...మీరు అలా అనప్పుడు అల్లా నాకు ఏంటి అనుకునేదాన్ని కానీ...ఈ లోకం లో మీ తోడు లేనిదే బతకడం నా వల్ల కాదు ...
ప్రతి నెల మీరు బండి మీద మమల్ని బీచ్ కి తీసుకువెళ్ళి రోజు అంత అక్కడ గడిపి రావడం ఇంకా కళ్ళలో మెదులుతుంది...
స్కూల్ లో ఒక అబ్బాయి ఎడిపిస్తున్నాడు ani మీరు ఆ అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్లి ఇదేనా పెంపకం అని తిట్టడం ఇంకా గుర్తు ఉంది...
నా క్లాసు మేట్స్ మిమ్మల్ని హిట్లేర్ అని పిలవడం...వాళ్ళు ఇప్పటికి అలానే అంటారు...
అరచేతిలో పెట్టుకుని పెంచుకున్నారు మీరు మమల్ని..నాకు కష్టం కలిగినప్పుడు మీ బాధని అర్ధం చేసుకోకుండా మిమ్మల్ని తిట్టినా కడుపులో పెట్టి దాచుకున్నారు...

మీ బిడ్డలగా పుట్టడం మా అదృష్టం.. ఎప్పటికి నీ కుతురుగానే పుట్టాలి అని కోరుకుంటా .... అమ్మతో సమానంగా కాదు అమ్మకన్నా ఎక్కువుగా చూసుకున్న మీ పాదాలకు నమస్కరిస్తూ...

మీ
పెద్దమ్మాయి

4 comments:

హను said...

chala baga chepparu anDi, nijam gaa mee daddy great

Renuka said...

simple ga mee father meeda unna prema ni chepparu sirisha...loved it!

Sirisha said...

:) thank u hanu and renuka

Sunita said...

Chaaala baaga raasaru, felt a lil nostalgic.. beautifully written :)